వైరల్: వింతైన ‘స్టార్-నోస్డ్’ జీవి.. చూస్తే భయపడాల్సిందే..!

భూమి మీద ఎన్నో రకాల వింత జీవులు ఉన్నాయి.సోషల్ మీడియాలో ఎన్నో రకాల జంతువుల ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి.

వాటిలో కొన్ని జీవులు ఎంతో అందంగా ఉంటాయి.మరి కొన్ని భయాందోళనకు గురిచేస్తుంటాయి.

అసలు మనం ఎప్పుడూ చూడలేని జీవులను సైతం సోషల్ మీడియా ద్వారా చూడగలుగుతున్నాం.తాజాగా ఓ వింత జీవికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆక్టోపస్ మాదిరిగా తల, చిన్న కళ్లు, నక్షత్రం వలే కనిపించే ముక్కు ఉన్న జంతువు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ జీవిని స్టార్ నోస్డ్ మోల్ గా పిలుస్తారు.

Advertisement

ఈ జీవి ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది.దీనికి 25 వేల మినట్ సెన్సార్ రెసిప్టార్స్ ఉంటాయి.

ఇవి దాని చుట్టూ ఉన్న మార్గాన్ని కనుగొనడంలో సహాయపడాయి.ఇది ఎక్కువగా భూగర్భ సొరంగాలు తవ్వడానికి తన పొడవైన పంజాలను ఉపయోగిస్తుంది.

స్టార్ నోస్డ్ మోల్ కి ప్రపంచంలోనే అత్యంత వేగంగా తినే జీవిగా పేరు ఉంది.ఇది కేవలం సెకనులో పావు వంతులోనే దాని ఎరను గుల్ల చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

వానపాములు, నత్తలు, చిన్న ఉభయచరాలు, చేపలు వంటి ఆహారాన్ని చాలా వేగంగా గుర్తిస్తుంది.అంతేకాదు మంచు అడుగున సైతం ఈ జీవులు ఈదగలవు.

చిప్స్ ఇష్టంగా తింటున్నారా..అయితే ఇది చదివితీరాల్సిందే....
Advertisement

తాజా వార్తలు