వైరల్ వీడియో: భారతీయ సంప్రదాయంలో ఆస్ట్రేలియా ఆటగాడి వివాహ మహోత్సవం..!

ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ క్రికెట్ ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ గురించి తెలియని వారు వుండరు.

దాదాపు 2017 నుంచి డేటింగ్ చేస్తున్న తన చిరకాల స్నేహితురాలు అయినటువంటి విని రామన్‌ ను తాజాగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

గత వారం ఆస్ట్రేలియాలో తమ సాంప్రదాయ క్రిస్టియన్ పద్ధతిలో ఆమెను వివాహం చేసుకోగా, నేడు సాంప్రదాయ భారతీయ పద్ధతిలో చెన్నైలో మరోసారి వివాహం చేసుకున్నారు.దానికి సంబంధించిన మాక్స్‌వెల్, విన్నీల వివాహ వీడియో ఎంతో ఫన్నీగా ఉంది.

మ్యాక్స్‌వెల్ పెళ్లికి క్రికెటర్ల నుంచి ఐపీఎల్ టీమ్‌ల వరకు అందరూ శుభాకాంక్షలు తెలిపారు.అవును.

, మాక్స్‌వెల్ పాత జీవితానికి స్వస్తి చెప్పి కొత్త ప్రారంభానికి గుడ్ లక్ చెప్పాడు భారత మాజీ ఆటగాడు హర్బజన్ సింగ్. ఈ విషయాన్ని తెలియజేస్తూ మాక్స్‌వెల్ తన పెళ్లి ఫొటోలు చెన్నై సూపర్ కింగ్స్ ట్విట్టర్ ఖాతా నుంచి షేర్ చేశారు.

Advertisement

మాక్స్‌వెల్ డిప్రెషన్‌తో పోరాడుతున్నప్పుడు ఈ ఇద్దరి మధ్య సాన్నిత్యం ఏర్పడినట్టుగా తెలుస్తోంది.ఈ విషయాన్ని మ్యాక్స్‌వెల్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.

మాక్స్‌వెల్ కోలుకున్నాక, అతను క్రికెట్ మైదానంలో మరలా రెచ్చిపోయాడు.బిగ్ బాష్ నుంచి IPL 2021 వరకు, ఈ ఆటగాడు వేగంగా బ్యాటింగ్ చేయడం ద్వారా అందరి హృదయాలను గెలుచుకున్నాడు.

ఇకపోతే, మాక్స్‌వెల్ తన తొలి మ్యాచ్‌లో ఓడిపోయినందున బెంగళూరు జట్టు అతని నుండి మెరుగైన ఆట కోసం ఎదురుచూస్తుంది.ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో బెంగళూరు జట్టు ఓడిపోయిన విషయం తెలిసినదే.205 పరుగులు చేసినప్పటికీ వారు ఓటమి చవిచూడాల్సి వచ్చింది.ఐపీఎల్ 2021లో గ్లెన్ మాక్స్‌వెల్ 15 మ్యాచ్‌ల్లో 42.75 సగటుతో 513 పరుగులు చేశాడు.అతని స్ట్రైక్ రేట్ కూడా 144 కంటే ఎక్కువగా ఉంది.

కాబట్టి బెంగళూరు అభిమానులు మాక్స్‌వెల్ వీలైనంత త్వరగా జట్టులోకి రావాలని కోరుకోవడం విశేషం.

జయసుధ కోసం ఆ ఇద్దరు దర్శకులు పోటీ పడేవారు..
Advertisement