పూజా కార్యక్రమాలతో 'దళపతి 68' గ్రాండ్ లాంచ్.. స్టార్ కాస్ట్ వీరే!

స్టార్ హీరో దళపతి విజయ్ జోసెఫ్( Thalapathy Vijay ) సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్( Lokesh Kanagaraj ) దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ లియో ( LEO ).

ఈ సినిమా దసరా కానుకగా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

అక్టోబర్ 19న ఈ సినిమా రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది.టాక్ పరంగా మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ దసరా సీజన్ కావడంతో ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్స్ వస్తున్నాయి.

ఇక ఈ సినిమా హిట్ అవ్వడంతో విజయ్ తన నెక్స్ట్ సినిమాను వెంటనే స్టార్ట్ చేసాడు.తన కెరియర్ లో 68వ సినిమాను విజయ్ తాజాగా పూజా కార్యక్రమాలతో దసరా రోజు గ్రాండ్ గా లాంచ్ చేసారు.

విజయ్ దళపతి నెక్స్ట్ తన 68వ సినిమాను డైరెక్టర్ వెంకట్ ప్రభు ( Venkat Prabhu ) దర్శకత్వంలో చేయనున్నాడు.ఎప్పుడో అఫిషియల్ ప్రకటన వచ్చిన ఈ సినిమాను ఈ రోజు గ్రాండ్ గా లాంచ్ చేసారు.విజయ్ సింపుల్ అండ్ కూల్ ప్రెజెన్స్ లో ముహూర్తం జరుపుకుంది.

Advertisement

అలాగే ఈ సినిమా స్టార్ కాస్ట్ పై కూడా క్లారిటీ వచ్చేసింది.ఈ సినిమాలో విజయ్ కు జోడీగా మీనాక్షి చౌదరి( Meenakshi Chaudhary ) హీరోయిన్ గా నటిస్తుండగా నటి స్నేహ, నటుడు జైరాం, జీన్స్ నటుడు ప్రశాంత్, ప్రభుదేవా, నటి లైలా, డాన్స్ మాస్టర్ ప్రభుదేవా, స్టార్ కమెడియన్ యోగిబాబు సహా వెంకట్ ప్రభు గ్యాంగ్ నటులు కూడా ఈ సినిమాలో భాగం కానున్నారట.

కాగా కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్నట్టు ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

Advertisement