మహేష్‌, రాజమౌళి సినిమాపై విజయేంద్ర ప్రసాద్‌ తాజా వ్యాఖ్యలు

మహేష్‌ బాబు, రాజమౌళి కాంబోలో సినిమా రాబోతుంది.ఆర్ ఆర్‌ ఆర్ తర్వాత రాజమౌళి చేయబోతున్న సినిమా అదే అనే విషయం ప్రతి ఒక్కరికి తెల్సిందే.

ఇప్పుడు ఆ సినిమా గురించిన వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.కథ అది ఇది అంటూ ఎన్నో పుకార్లు మీడియాలో వస్తున్న నేపథ్యంలో విజయేంద్ర ప్రసాద్‌ పలు సందర్బాల్లో క్లారిటీ ఇచ్చాడు.

తాజాగా మరో సారి విజయేంద్ర ప్రసాద్‌ మహేష్‌ బాబుతో చేయబోతున్న సినిమా గురించి ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో మరియు మీడియా వర్గాల్లో ఈ సినిమా గురించి వస్తున్న వార్తల నేపథ్యంలో రచయిత కమ్‌ రాజమౌళి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Vijayendra Prasad About Rajamouli And Mahesh Babu, Flim News, Mahesh Babu, Rajam

జాతీయ మీడియా సంస్థతో విజయేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ మహేష్‌ బాబుతో సినిమా గురించి గత ఏడాదిన్నర కాలంగా చర్చలు జరుగుతున్నాయి.కాని ఈ ఏడాదిన్నర కాలంలో కూడా కేవలం ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సినిమా ఉండాలని.అడ్వంచర్‌ మూవీగా ఉండాలని మహేష్ బాబు కోరుకుంటున్నాడని విజయేంద్ర ప్రసాద్‌ చెప్పుకొచ్చారు.

Advertisement
Vijayendra Prasad About Rajamouli And Mahesh Babu, Flim News, Mahesh Babu, Rajam

మరి ఇప్పటి వరకు అందుకు సంబంధించి ఏమైనా వర్క్‌ జరిగిందా.కథ సిద్దం అయ్యిందా అంటే లేదని ఆయన క్లారిటీ ఇచ్చాడు.

విజయేంద్ర ప్రసాద్‌ ఆఫ్రికా వెళ్లి అక్కడ పరిస్థితులను పరిశీలించి కథను సిద్దం చేయాలని భావిస్తున్నాడట.త్వరలోనే విజయేంద్ర ప్రసాద్‌ ఆఫ్రికా వెళ్లి కథను సిద్దం చేస్తాడేమో చూడాలి.

 ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని రాజమౌళి ఆ తర్వాత మహేష్ బాబు సినిమా పట్టాలెక్కించే అవకాశం ఉంది.మరో వైపు మహేష్‌ బాబు కూడా ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాను చేస్తున్నాడు.

ఆ సినిమా షూటింగ్ పూర్తి కాగానే త్రివిక్రమ్‌ మూవీ చేస్తాడు.ఆ సినిమా లు పూర్తి అయిన తర్వాత జక్కన్న దర్శకత్వంలో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.

నటుడిగా పనికిరాడు అని చెప్పిన రాజశేఖర్ తోనే 5 సినిమాలు చేసిన నిర్మాత ఎవరో తెలుసా?
Advertisement

తాజా వార్తలు