Vijayashanthi: ఆ విషయంలో పొరపాటు చేశానని విజయశాంతికి సారీ చెప్పిన ఎన్టీఆర్.. ఏం జరిగిందంటే?

తెలుగు సినీ ప్రేక్షకులకు నందమూరి తారకరామారావు( Sr NTR ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.గత కొద్ది రోజులుగా ఎన్టీఆర్ పేరు మారు మోగిపోతోంది.

ఆయన గురించి ఎంతమంది ఎన్ని విధాలుగా ఎన్ని చెప్పినా కూడా తప్పే అని చెప్పవచ్చు.తాజాగా నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా సీనియర్ నటి విజయశాంతి( Vijayashanti ) ఎన్టీఆర్ తో తనకున్న జ్ఞాపకాలను మధురమైన అనుభూతులను పంచుకుంది.ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఎన్టీఆర్ గురించి ఈ విధంగా రాసుకొచ్చింది.

నేను 14 సంవత్సరాల చిన్న వయసులో అనగా 1980 లో నా సినిమా జీవిత ప్రయాణ ప్రారంభ సంవత్సరాలలో సత్యంశివం సినిమాలో చెల్లెలిగా ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ గారితో కలిసి నటించే అవకాశం కలిగింది.ఆ తర్వాత 1985లో ప్రతిఘటన చిత్రానికి ఉత్తమ నటిగా నంది అవార్డును ఎన్టీఆర్ గారే ముఖ్యమంత్రిగా నాకు అందించి, అభినందించి, ప్రజాప్రాయోజిత చిత్రాలలో మరింతగా కొనసాగాలని ఆశీర్వదించారు.నటునిగా, నాయకునిగా వారిది తిరుగులేని జీవన ప్రస్తానం.

Advertisement

ఇక ఆయన మహోన్నతమైన వ్యక్తిత్వానికి చిన్న ఉదాహరణ.

బ్రహ్మర్షి విశ్వామిత్ర( Brahmarshi Vishwamitra ) చిత్రం డబ్బింగ్ ఎన్టీఆర్ గారు ఏవీఎం స్టూడియోలో చెబుతున్నప్పుడు 1990లో నేను చిరంజీవి గారితో అదే స్టూడియోలో సినిమా చేస్తూ వారిని డబ్బింగ్ థియేటర్‌లో కలవడానికి వెళ్లినప్పుడు, డబ్బింగ్ థియేటర్ వెలుతురు లేని వాతావరణంలో వారు నన్ను సరిగా గమనించలేదని బాధపడ్డాను.అయితే ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ గారు తర్వాతి రోజు ఉదయం 6 గంటలకే మద్రాసులో మా ఇంటికి వచ్చి, అమ్మాయిని మేము చూసుకోలేదు.పొరపాటు జరిగింది, ఐయామ్ సారీ, బిడ్డకు తెలియజేయండి అని శ్రీనివాస్ ప్రసాద్ గారితో చెప్పిన సంఘటన ఎప్పటికి గుర్తుగానే, గౌరవంగానే మిగులుతుంది అని రాసుకొచ్చింది విజయశాంతి.

Advertisement

తాజా వార్తలు