Vijayasaireddy Nara Lokesh : ఇంత బాధ్యత లేనోడివేంటి లోకేసం ? 

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎప్పుడు వైసిపి ప్రభుత్వాన్ని విమర్శించినా,  అలాగే జగన్ పై ఏ కామెంట్ చేసిన ఆయనకు గట్టిగా కౌంటర్ ఇచ్చేందుకు రంగంలోకి దిగిపోతూ ఉంటారు వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.

వైసిపి అధికారంలోకి వచ్చాక, రాకముందు ఇంతే స్టైల్ లోకేష్ ,చంద్రబాబు వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి కౌంటర్లు ఇస్తూనే వస్తున్నారు.

జగన్ కు అత్యంత సన్నిహితులుగా ముద్ర వేయించుకున్న విజయ సాయి రెడ్డి పార్టీలో కేలకనేతగా ఉండడంతో పాటు,  సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తమ రాజకీయ ప్రత్యర్థులు చేసే విమర్శలు తిప్పుకొడుతూ ప్రతి విమర్శలు చేస్తూ దీటుగా సమాధానం ఇస్తూ ఉంటారు.వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న వ్యవహారం చోటు చేసుకున్న, సోషల్ మీడియాను వేదికగా చేసుకుని వైసిపి ప్రభుత్వం ను ఇరుకుని పెట్టేలా చేయడంతో పాటు, ప్రజల్లో తన పరపతి పెరిగే విధంగా చేసుకుంటున్నారు.

         ఈ క్రమంలోనే నారా లోకేష్ పై విజయ్ సాయి రెడ్డి సంచలన విమర్శలు చేశారు.శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురం లో మహిళలపై జరిగిన అమానుష ఘటనపై లోకేష్ వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ సంచలన ట్రీట్ చేయడం పై విజయ్ సాయి రెడ్డి తనదైన స్థాయిలో కౌంటర్ ఇచ్చారు.

బాధ్యత లేకుండా లోకేష్ వ్యవహరిస్తున్నారని , లోకేష్ ప్రవర్తన చూస్తుంటే ఆయన పుట్టుకపైనే కాదు, పెంపకం పైన కూడా అనుమానం వచ్చేలా ప్రవర్తిస్తున్నావు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.   

Advertisement

 ఇంత బాధ్యత లేని వాడివేంటి లోకేశం? ఎవరో ఇంట్లో కుటుంబ కలహాలను కూడా రాజకీయం చేస్తూ వైసీపీకి అంటగడుతూ శునకానంధం  పొందుతున్నావు కదా పప్పూ! నీ పుట్టుకపైనే కాదు పెంపకంపై కూడా అనుమానం వచ్చేలా ప్రవర్తిస్తున్నావు అంటూ విజయసాయిరెడ్డి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

శ్రీ కృష్ణ పరమాత్ముడికి ఎంత మంది సంతానమో తెలుసా?
Advertisement

తాజా వార్తలు