బీజేపీ పార్టీని టీడీపీకి పురంధేశ్వరి తాకట్టు పెడుతున్నారు అంటూ విజయసాయిరెడ్డి సీరియస్ వ్యాఖ్యలు..!!

వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి( Vijayasai Reddy ) ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై( Purandheswari ) ట్విట్టర్ లో సంచలన ట్వీట్ చేశారు.

"పురందేశ్వరి పదవుల కోసం బీజేపీలో( BJP ) చేరి ఆ పార్టీని టీడీపీకి( TDP ) తాకట్టు పెట్టడానికి పనిచేస్తున్నారే కానీ ఆమెకు తన పార్టీపై ప్రేమ, అభిమానం లేవు.

మొదట టీడీపీ.తర్వాత ఎన్టీఆర్ టీడీపీ, తర్వాత బీజేపీ, మళ్లీ కాంగ్రెస్.

మళ్లీ బీజేపీ.ఇలా వరుసగా నాలుగుసార్లు పార్టీలు మారిన చరిత్ర పురందేశ్వరిది.

బీజేపీలో చేరిన తర్వాతైనా ఆమెవల్ల ఒక్క ఓటు అయినా అదనంగా పార్టీకి వచ్చిందా అంటే.ఇంకా పార్టీ ఓట్లను టీడీపీకి మళ్లించారనే చెప్పాల్సి ఉంటుంది.

Vijayasai Reddy Serious Comments Saying That Purandheshwari Is Pledging The Bjp
Advertisement
Vijayasai Reddy Serious Comments Saying That Purandheshwari Is Pledging The BJP

ఎయిర్ ఇండియా( Air India ) ఇండిపెండెంట్ డైరెక్టర్ గా కేంద్రంలో ఒక బాధ్యతయతమైన పదవిలో ఉండి ఆ విమానయాన సంస్థ అమ్మకం విషయంలో మీరు మధ్యవర్తంచేసి ఆ సంస్థ నుంచి ముడుపులు తీసుకున్నది వాస్తవం కాదా? మీ నిజాయితీని నిరూపించుకోవడానికి సిబిఐ విచారణకు( CBI Enquiry ) సిద్ధమేనా? ఆ మేరకు కేంద్రానికి రాయగలరా?.ఏపీలో మద్యం స్కాం అంటూ ఆరోపణలు చేసి, మీరు, మీ కుటుంబసభ్యులు మద్యం సిండికేట్ బ్రోకర్లతో మీ భర్త వెంకటేశ్వరరావు గారు, మీ కుమారుడు హితేష్, గీతం భరత్ బేరాలాడి ముడుపులు తీసుకున్నది నిజం కాదా ?హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్ట్రిక్ట్ లో అత్యంత ఖరీదైన విల్లాను ఎలా నిర్మిస్తున్నారు? ఆ విల్లాకు సొమ్ములు పెడుతున్నది ఎవరు?" అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

జుట్టు రాల‌కుండా ఒత్తుగా పెరగాలా? అయితే ఈ చిట్కా మీకే!
Advertisement

తాజా వార్తలు