విజయ్ సేతుపతి పూరి జగన్నాథ్ సినిమాకు వెరైటీ టైటిల్... అనౌన్స్మెంట్ అప్పుడేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా మంచి సక్సెస్ అందుకున్న పూరి జగన్నాథ్( Puri Jagannath ) ఇటీవల కాలంలో వరుస ప్లాప్ సినిమాలను చవిచూస్తున్న నేపథ్యంలో ఈయనతో సినిమా చేయటానికి కూడా ఏ హీరోలు ముందుకు రాలేదు.

అయితే ఇటీవల డబల్ ఇస్మార్ట్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన పూరీ జగన్నాథ్ కు ఈ సినిమా ద్వారా మరోసారి నిరాశ ఎదురయింది.

  ఇక ఈ సినిమా తర్వాత ఈయన తదుపరి సినిమాలను ఇప్పటివరకు ప్రకటించలేదు కానీ తాజాగా ఒక వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Vijay Sethupathi Puri Jagannath Movie Title Locked Details,vijay Sethupathi, Pur

పూరి జగన్నాథ్ కు ఎట్టకేలకు ఒక హీరో దొరికేసారని, పూరి జగన్నాథ్ చెప్పిన కథ నచ్చడంతో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి( Vijay Sethupathi ) ఈ సినిమాకు ఓకే చెప్పారని వార్తలు వస్తున్నాయి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అన్ని వివరాలను కూడా అధికారకంగా ప్రకటించబోతున్నారని తెలుస్తుంది.అయితే తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఒక టైటిల్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఈ సినిమాకు పూరి జగన్నాథ బెగ్గర్ ( Beggar ) అనే టైటిల్ ఖరారు చేశారని తెలుస్తోంది.

Vijay Sethupathi Puri Jagannath Movie Title Locked Details,vijay Sethupathi, Pur

ఈ టైటిల్ ఇటు తెలుగు అటు తమిళ భాషలో కూడా సూట్ అవుతుందన్న ఉద్దేశంతో ఆయన బెగ్గర్  అనే వెరైటీ టైటిల్ ను సెలెక్ట్ చేశారని తెలుస్తుంది.ఇక పూరి వివరించిన కథ విజయ్ సేతుపతికి కూడా ఎంతో అద్భుతంగా నచ్చడంతోనే ఈయనతో సినిమాకు కమిట్ అయినట్లు తెలుస్తోంది.ఈసారి పూరి జగన్నాథ్ తనని తాను కొత్తగా ప్రేక్షకులకు పరిచయం చేసుకోబోతున్నారని చెప్పాలి.

Advertisement
Vijay Sethupathi Puri Jagannath Movie Title Locked Details,Vijay Sethupathi, Pur

పూరి మూవీ కోసం బల్క్‌గా డేట్స్ ఇచ్చినట్లు చెబుతోన్నారు.ఏప్రిల్ నెలాఖరున లేదా మే ఫస్ట్ వీక్‌లో పూరి జగన్నాథ్‌, విజయ్ సేతుపతి మూవీ అఫీషియల్‌గా లాంఛ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

నితిన్ రాబిన్ హుడ్ సినిమా ఎలా ఉందంటే?
Advertisement

తాజా వార్తలు