రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ( Samantha ) హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ లవ్ రొమాంటిక్ అండ్ మూవీ ఖుషి .
విజయ్, సమంత ఇద్దరు కూడా ప్లాప్స్ తో బాధ పడుతున్నారు.
విజయ్ లైగర్ సినిమాతో, సమంత శాకుంతలం సినిమాతో భారీ ప్లాప్ లను అందుకున్న విషయం తెలిసిందే.
మరి ఈ ప్లాప్ ను ఫ్యాన్స్ మర్చిపోవాలంటే ఇంతకంటే హిట్ సినిమా రావాలి.అందుకే ఈ ఇద్దరు కూడా ఇప్పుడు కలిసి నటిస్తున్న ఖుషి( Khushi ) సినిమా మీదనే భారీ అంచనాలు పెట్టుకున్నారు. శివ నిర్వాణ( Shiva Nirvana ) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.
సమంత, విజయ్ కలిసి జంటగా నటిస్తున్న ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతుంది.ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టు కుంటుంది.
ఫస్ట్ సింగిల్( Khushi Movie First Single ) చార్ట్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.ఇక ఈ సినిమా నుండి ఇప్పుడు మరో అప్డేట్ వైరల్ అవుతుంది.
ఈ సినిమా ఓటిటి డీల్ లాక్ అయినట్టు తెలుస్తుంది.
అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటిటి డీల్ ను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్( Khushi Movie OTT Amazon prime ) వీడియో సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది.దీంతో ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ ప్రైమ్ వీడియోలో ఉంటుందని చెప్పాలి.ఇక ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతున్నట్టు ఈ మధ్యనే ప్రకటించారు.
కాగా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తుండగా.మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో పాన్ ఇండియన్ మూవీగా నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy