హీరో అని ఫీల్ అవుతున్నావా... వైష్ణవి తమ్ముడిని ఆడుకుంటున్న విజయ్ ఫాన్స్!

బేబీ సినిమా( Baby Movie ) ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయ్యారు ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya).

యూట్యూబర్ గా ఎన్నో వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె పలు సినిమాలలో హీరోలకు చెల్లెలు పాత్రలలో నటించే అవకాశాలను అందుకున్నారు.

అయితే ఈమె నటన టాలెంట్ చూసినటువంటి దర్శకులు ఈమెకు సినిమా అవకాశాలు కల్పించారు.ఈ క్రమంలోనే సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన బేబీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా ఊహించని విధంగా మంచి సక్సెస్ అందుకుంది.

ఇలా ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ఈ సినిమా పై ప్రశంసలు కురిపించడమే కాకుండా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వైష్ణవి చైతన్య పేరు మారుమోగిపోతుంది.ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు కూడా వెల్లువెత్తుతున్నాయి.ఇదిలా ఉండగా తాజాగా వైష్ణవి చైతన్య తమ్ముడు పై విజయ్ దేవరకొండ అభిమానులు తీవ్రస్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు.

Advertisement

ఇలా వైష్ణవి చైతన్య తమ్ముడు పై విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే.

ఆనంద్ దేవరకొండతో కలిసి ఈమె బేబీ సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు.ఈ క్రమంలోని పలు సందర్భాలలో విజయ్ దేవరకొండను కూడా కలిశారు.ఈ క్రమంలోనే తాజాగా వైష్ణవి తన తమ్ముడితో కలిసి విజయ్ దేవరకొండ( Vijay Devarakond a) తో ఒక ఫోటో దిగారు ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

ఈ ఫోటోలలో వైష్ణవి చైతన్య తమ్ముడు కాస్త ఆటిట్యూడ్ చూపిస్తూ ఏకంగా విజయ్ దేవరకొండ పైన చేయి వేశారు.ఇలా విజయ్ పై చేయి వేస్తే ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో మండిపడిన విజయ్ ఫ్యాన్స్ తనని ట్రోల్ చేశారు.

నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా ఇలా యాటిట్యూడ్ చూపిస్తున్నావ్.ఇవే కాస్త తగ్గించుకుంటే మంచిది అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం విజయ్ దేవరకొండ మీ ఇంటికి వచ్చి నీతో ఫోటో దిగారా అంటూ వైష్ణవి చైతన్య తమ్ముడిని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో కొత్త సినిమాకి కమిట్ అయిన రవితేజ...డైరెక్టర్ ఎవరంటే..?
Advertisement

తాజా వార్తలు