Kushi movie : విజయ్ + బన్నీ + నాని = ఖుషి…..ఈ సినిమా కూడా కష్టమే!!

ప్రస్తుతం తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూన్న చిత్రం "ఖుషి( Kushi movie )".

విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు.ఇప్పటికి పాటలన్ని విడుదలయ్యి మంచి బుజ్ ని క్రీట్ చెయ్యగా, తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను రిలీజ్ చేసారు మేకర్స్.

ఐతే ట్రైలర్ చూసాక మాత్రం కాస్త నిరాశ చెందారు అభిమానులు.దీనికి కారణం కథలో కొత్తదనం లేకపోవడమే.

ట్రైలర్ ను సరిగ్గా పరిశీలిస్తే మూడు పాత తెలుగు సినిమాలను కలిపి అతికించినట్టు ఉంది.హీరో కాశ్మీర్కు వెళ్లి అక్కడ ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించడం, కానీ తరువాత తను ముస్లిం కాదు బ్రాహ్మణ అమ్మాయి అని తెలియడం.ఈ లైన్ చూస్తుంటే అల్లు అర్జున్, పూరి జగన్నాథ్ కాంబో లో వచ్చిన దేశముదురు( Desamuduru ) గుర్తొస్తోంది.

Advertisement

అలాగే, హీరో, హీరోయిన్ రెండు వేరు వేరు కమ్యూనిటీలు చెందిన వారు కావడం, వాళ్ళు ఎలాగైనా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలి తాపత్రయపడడం, దీనికోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు.ఇవన్నీ చూస్తుంటే తాజాగా వచ్చిన నాని చిత్రం అంటే సుందరానికి గుర్తొస్తోంది.

అలాగే ఈ చిత్రంలో పెళ్లయ్యాక, హీరో, హీరోయిన్ మధ్య మనస్పర్థలు రావడం, గొడవలు జరగడం.ఇవన్నీ చూస్తుంటే, విజయ్ దేవరకొండ చిత్రం గీత గోవిందం చూసినట్టు ఉంది.

భారీ ఎక్సపెక్టషన్స్ తో విడుదలైన విజయ్ చిత్రం లైగర్ బాక్స్ ఆఫీస్ వద్ద డిసాస్టర్ గా మిగిలింది.విజయ్ మళ్ళీ ఫామ్ లోకి రావాలంటే, ఖుషి హిట్ అవ్వడం చాల అవసరం.అలాగే దర్శకుడు శివ నిర్వాణ( Shiva Nirvana ) కి కూడా ఈ విజయం చాల ప్రధానం.

కానీ ఈ కథ చూస్తుంటే వాళ్ళ కోరిక తీరేలా కనిపించడం లేదు.కానీ శివ నిర్వాణ కథనం చాలా స్మూత్ గా ఉంటుంది.తన సున్నితమైన టేకింగ్ తో ఆర్డినరీ కథను ఎక్సట్రార్డినరీగా చూపించగల ఒక తెలివైన దర్శకుడు.

అక్కినేని ఫ్యామిలీ హీరోలకు ముందుకి వెళ్లే ఛాన్స్ లేదా??

మరి శివ మేజిక్ ఈ కథ పై పని చేస్తుందో లేదో.వేచి చూడాల్సిందే!!.

Advertisement

తాజా వార్తలు