ఆ క్రికెటర్ బయోపిక్ పై విజయ్ దేవరకొండ మోజు.. ఈ సమయంలో తీరేనా?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.విజయ్ దేవరకొండ ఇటీవలే లైగర్ సినిమాతో పేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

భారీ అంచనా నడుము విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.కానీ విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.

అలాగే విజయ్ దేవరకొండ తన సినిమా విషయంలో నెగిటివ్ టాక్ లు, ట్రోలింగ్స్ చేసిన కూడా పెద్దగా పట్టించుకోకుండా తన తదుపరి సినిమాల పై దృష్టిని సారించాడు.ఇకపోతే విజయ్‌ దేవరకొండ జన గణ మన, ఖషి చిత్రాల షూటింగ్‌ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నాడు.

ఇది ఇలా ఉంటే ఇటీవల జరిగిన ఇడియా, పాకిస్తాన్‌ మ్యాచ్‌ను వీక్షించిన విజయ్ దేవరకొండ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.అయితే మ్యాచ్ ఇంకా ప్రారంభం కాక ముందు కామెంటర్స్‌ మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్ పఠాన్, వసీం అక్రమ్‌తో కలిసి స్టేడియంలో అడుగుపెట్టారు విజయ్.

Advertisement

ప్రీ మ్యాచ్ షోలో అవకాశం వస్తే ఏ క్రికెటర్ బయోపిక్‌లో నటించాలనుందని కామెంటర్స్ అడిగిన ప్రశ్నకు విజయ్ దేవరకొండ ఇలా ధోని భాయ్‌ బయోపిక్‌ చేయాలని ఉంది అని సమాధానం ఇచ్చాడు.

కానీ ఆయన బయోపిక్‌ను సుశాంత్‌ సింగ్‌ చేశాడు.ధోనీ కాకుండా కోహ్లి అన్న బయోపిక్‌ లో నటించాలనుంది అని చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ.ఒకవేళ అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను.

కోహ్లీ పాత్రకు నేను అయితే కరెక్ట్‌ సూట్‌ అవుతాను అనిపిస్తోంది తెలిపాడు.మరి విజయ్ దేవరకొండ కోరిక మేరకు ఎవరైనా మరి విరాట్ కోహ్లీ బయోపిక్ తో విజయ్ తో సినిమా చేయడానికి డైరెక్టర్స్ ముందుకు వస్తారో లేదో చూడాలి మరి.

రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు : రాష్ట్ర మంత్రులు
Advertisement

తాజా వార్తలు