సామ్ క్షమాపణల పై స్పందించిన విజయ్ దేవరకొండ... ఏమన్నారంటే?

సమంత గత కొంతకాలంగా మాయోసైటిసిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే.

ఇలా ఈ వ్యాధితో బాధపడుతున్నటువంటి సమంత పూర్తిగా తాను కమిట్ అయిన సినిమాల నుంచి కాస్త విరామం తీసుకొని పూర్తిగా తన ఆరోగ్యంపై దృష్టి పెట్టారు.

ఇలా ఈమె అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే యశోద సినిమాను పూర్తి చేశారు.అయితే తన ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణించడంతో తాను నటిస్తున్న ఖుషి సినిమాకు కాస్త విరామం ఇచ్చారు.

దీంతో విజయ్ దేవరకొండ అభిమానులు సమంతపై కాస్త అసహనం వ్యక్తం చేశారు.

Vijay Devarakonda Responded To Sams Apology What Did He Say ,samantha, Vijay De

కేవలం సమంత కారణంగానే ఖుషి సినిమా షూటింగ్ ఆగిపోయిందని, తమ హీరో సమంత కోసం ఎదురుచూస్తూ తన సమయం మొత్తం వృధా చేస్తున్నారు అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు.అయితే ఈ విషయంపై సమంత స్పందిస్తూ తన వల్ల ఖుషి సినిమా ఆలస్యం అవుతున్నందుకు విజయ్ అభిమానులకు సమంత క్షమాపణలు చెప్పారు.అయితే ఈ క్షమాపణలపై విజయ్ దేవరకొండ స్పందిస్తూ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

Vijay Devarakonda Responded To Sams Apology What Did He Say ,samantha, Vijay De
Advertisement
Vijay Devarakonda Responded To Sams Apology What Did He Say ,Samantha, Vijay De

ట్విట్టర్ వేదికగా విజయ్ దేవరకొండ స్పందిస్తూ.మేమందరం నీ రాక కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాం.నువ్వు పూర్తి ఆరోగ్యంతో నవ్వుతూ తిరిగి రావాలని కోరుకుంటున్నాం.

అని విజయ్ దేవరకొండ ట్విట్టర్ వేదికగా సమంత క్షమాపణలపై స్పందిస్తూ చేసినటువంటి ఈ ట్వీట్ వైరల్ గా మారింది.ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా సమంత అనారోగ్య సమస్యల కారణంగా వాయిదా పడింది.

ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు
Advertisement

తాజా వార్తలు