తమ్ముడి రుణం తీర్చుకుంటున్న విజయ్ దేవరకొండ

విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ స్టార్‌ హీరో.పాన్ ఇండియా హీరోగా గుర్తింపు దక్కించుకునేందుకు లైగర్ తో ప్రయత్నాలు మొదలు పెట్టాడు.

భారీ ఎత్తున అంచనాలున్న లైగర్‌ సినిమా విడుదల కు సిద్దం అవుతుంది.చివరి దశ చిత్రీకరణ అతి త్వరలోనే ప్రారంభం అవ్వబోతుంది.

లైగర్ సినిమా చిత్రీకరణ ఉన్నా కూడా విజయ్ దేవరకొండ మాత్రం తమ్ముడు ఆనంద్ దేవరకొండ తో తాను నిర్మించిన పుష్పక విమానం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.పెద్ద ఎత్తున ఈ ప్రమోషనల్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ప్రముఖ తారలు పుష్పక విమానం కోసం ప్రమోషన్‌ చేస్తున్నారు.విజయ్‌ దేవరకొండ తన పలుకుబడి ఉపయోగించి బాగా పబ్లిసిటీ చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

Advertisement
Vijay Devarakonda Pay Back To Brother Anand Devarakonda Details, Vijay Devarakon

తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ కోసం ఇంత రిస్క్‌ తీసుకోవడం ఎందుకు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.తమ్ముడి తో సొంతంగా సినిమా ను నిర్మించాల్సిన అవసరం ఏంటీ అంటున్నారు.

తమ్ముడి రుణం తీర్చుకోవడం కోసం విజయ్ దేవరకొండ ఇదంతా చేస్తున్నాడు.ఎందుకంటే తమ్ముడు ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించి కుటుంబాన్ని పోషించి.

విజయ్ దేవరకొండ సినిమా ల్లో ప్రయత్నాలు చేస్తున్న సమయంలో డబ్బులు ఇచ్చి సాయం చేశాడు.ఆనంద్‌ ఉద్యోగం చేయకుంటే ఖచ్చితంగా విజయ్ కి ఆ బాధ్యత తప్పేది కాదు.

Vijay Devarakonda Pay Back To Brother Anand Devarakonda Details, Vijay Devarakon

అందువల్ల సినిమా ల్లో చేసే అవకాశాల కోసం ప్రయత్నించే వాడు కాదు.ఆనంద్ ఆర్థికంగా సాయం అందించడం వల్లే విజయ్ దేవరకొండ సినిమా ప్రయత్నాలు చేశాడు.అందుకే ఇప్పుడు తమ్ముడికి తనవంతు సాయంను గట్టిగా చేయాలని రౌడీ స్టార్ ప్రయత్నిస్తున్నాడు.

Jyothamma Jabardast : మానవత్వం మర్చిపోయిన ఓ సమాజమా ..అగ్గి తో కడగాలి నిన్ను !

తమ్ముడు కనుక మంచి స్టార్‌ గా నిలబడితే అప్పుడు తన బాధ్యత తీరుతుందని.అతడి రుణం తీరుతుందని విజయ్ దేవరకొండ భావిస్తున్నాడట.

Advertisement

తాజా వార్తలు