ఆ దర్శకుడితో కలిసి రౌడీ స్టార్ మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడా?

రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ( Vijay devarakonda ) చాలా కాలం తర్వాత ఒక భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

గీత గోవిందం,( Geetha Govindam Movie ) అర్జున్‌ రెడ్డి సినిమా ల తర్వాత చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది.

అయినా కూడా రౌడీ స్టార్‌ తగ్గకుండా ఆ సినిమా ప్రయత్నాలు చేశాడు.ఆ సమయంలో మజిలీ దర్శకుడు శివ నిర్వాన ( Shiva Nirvana )దర్శకత్వం లో రూపొందిన ఖుషి సినిమా తో పాజిటివ్ టాక్‌ ని దక్కించుకున్నాడు.

అంతే కాకుండా వసూళ్ల విషయం లో కూడా చాలా కాలం తర్వాత బ్రేక్ ఈవెన్ సాధించడం తో రౌడీ స్టార్‌ లో నమ్మకం పెరిగింది.

ఆ నమ్మకం తోనే పరశురామ్‌ దర్శకత్వం లో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.తాజాగా రౌడీ స్టార్‌ మరో సినిమాకు కమిట్ అయ్యాడు అంటూ వార్తలు వస్తున్నాయి.ఆ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నది మరెవ్వరో కాదు ఖుషి చిత్ర దర్శకుడు శివ నిర్వాన.

Advertisement

( Shiva Nirvana ) ఔను మరో సారి ఆ దర్శకుడితో సినిమాను చేసేందుకు గాను రౌడీ స్టార్‌ రెడీ అయ్యాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మొదట శివ నిర్వాన తన తదుపరి సినిమా ను నాని తో చేయాలి అనుకున్నాడు.కానీ నాని బిజీగా ఉండటం వల్ల చేసేది లేక తన తదుపరి సినిమా ను రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండతో చేయాలని నిర్ణయించుకున్నాడు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది లో వీరిద్దరి కాంబో మూవీ మొదలు అవ్వబోతుంది.

ఎప్పటిలాగే శివ నిర్వాన ఒక మంచి మెచ్యూర్డ్‌ కథ తో సినిమాను రూపొందించబోతున్నాడు.అన్ని అనుకున్నట్లుగా జరిగితే భారీ ఎత్తు ఆ సినిమా కూడా విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

అందుకే అభిమానులు ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు