ది ఫ్యామిలీ స్టార్ రివ్యూ: విజయ్ దేవరకొండ స్టార్ పడిపోయేలా ఉందే?

నటుడు విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) హీరో హీరోయిన్ లు గా పరశురాం (Parasuram ) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం ది ఫ్యామిలీ స్టార్( The Family Star ).

ఎన్నో అంచనాలు నడుమ నేడు ఏప్రిల్ 5, 2024 విడుదలైన ఈ సినిమా కథ ఏమిటి ఈ సినిమా ద్వారా విజయ్ సక్సెస్ అందుకున్నారా అనే విషయానికి వస్తే.

కథ:

ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు గోవర్ధన్ (విజయ్ దేవరకొండ) ఒక ఆర్కిటెక్ట్ ఇంజినీర్ చిన్నపాటి ఉద్యోగంతో తన కుటుంబ బండిని అదుపు పొదుపులతో పేరుకు తగ్గట్టుగానే కుటుంబ బరువు బాధ్యతలను మోస్తూ ఉంటారు.ఇలా ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిగా విజయ్ దేవరకొండ ఈ సినిమాలో మిడిల్ క్లాస్ అబ్బాయిగా గోవర్ధన్( Govardhan ) తన ఫ్యామిలీని ఎంతో కష్టంగా ముందుకు నడిపిస్తూ ఉంటారు ఇలాంటి తరుణంలోనే తన ఇంటి పై అద్దెకి ఉండేందుకు ఓ అమ్మాయి ఇందు (మృణాల్ ఠాకూర్) వస్తుంది ఇందు వచ్చిన తర్వాత గోవర్ధన్ జీవితం ఎలా మారిపోయింది అసలు ఇందు గోవర్ధనల పరిచయం ఎలా అయింది వీరి ప్రేమలో ఎలా పడ్డారు ఇక ఒక సాధారణ మిడిల్ క్లాస్ కుర్రాడిగా తన జీవితాన్ని ఎలా ముందుకు నడిపించారు అన్నది ఈ సినిమా కథ.

నటీనటుల నటన:

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఎమోషనల్ సన్నివేశాలలోనూ ఒక మిడిల్ క్లాస్ కుర్రాడి గాన అలాగే యాక్షన్ సన్నీ వేశాలలో ఎంతో అద్భుతంగా నటించారు.ఇక హీరో హీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు కూడా సినిమాకు హైలైట్ అయ్యాయి.జగపతిబాబు( Jagapathi Babu ) వాసుకి అభినయ వంటి వారందరూ కూడా వారి పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.

టెక్నికల్:

టెక్నికల్ విషయానికి వస్తే డైరెక్టర్ పరుశురాం( Director Parasuram ) ఈ సినిమాను గీత గోవిందం రేంజ్ లో మాత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోయారని చెప్పాలి.ఈ సినిమా కథనం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది.ఇక కెమెరా, ఎడిటింగ్ ఎంతో అద్భుతంగా ఉంది.

Advertisement

నిర్మాణాత్మక విలువలు కూడా బాగున్నాయి.

విశ్లేషణ:

ఈ సినిమాలో ప్రమోషన్స్ బట్టి చూస్తే కనుక సినిమా పట్ల భారీ అంచనాలు ఏర్పడ్డాయని చెప్పాలి అయితే ఈ అంచనాలను దృష్టిలో పెట్టుకొని సినిమాకు వెళ్తే కనుక ప్రేక్షకులకు నిరాశ తప్పదని చెప్పాలి.ఈ సినిమా చూస్తున్నంత సేపు సినిమాకు కనెక్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది ఇక మొదటి హాఫ్ కంటే సెకండ్ ఆఫ్ ఎమోషనల్ గా టచ్ చేసింది.ఈ సినిమా చూస్తుంటే కనుక ఇలాంటి సన్నివేశాలు చూసామనే భావన కలుగుతుంది ఇంకా కొన్ని సన్నివేశాలు బాగా సాగదీసి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టారు.

మొత్తానికి ఈ సినిమా గురించి ఒక మాటలో చెప్పాలి అంటే సీరియల్ ని సినిమాగా చేశారని చెప్పాలి.

ప్లస్ పాయింట్స్:

నటీనటుల నటన, ఎమోషనల్ సన్నివేశాలు, యాక్షన్ సీన్స్.సెకండ్ హాఫ్ పర్వాలేదు.

మైనస్ పాయింట్స్:

సాగదీసే సన్నివేశాలు, కథ కనెక్ట్ కాకపోవడం, కథనం మైనస్ అని చెప్పాలి.

బాటమ్ లైన్:

ఫ్యామిలీ స్టార్ లో మెయిన్ లీడ్ పర్వాలేదనిపిస్తారు.అలాగే కొన్ని సీన్స్ కేవలం ఓకే అనిపిస్తాయి కానీ విజయ్, పరశురాం పెట్ల హిట్ కాంబినేషన్ నుంచి అంచనాలు అందుకునే రేంజ్ సినిమా అయితే ఇది కాదు.ఇక వేసవి సెలవులు కావడంతో ఏదైనా మిరాకిల్ జరిగితే ఈ సినిమా సేఫ్ అవుతుంది అని చెప్పాలి.

రేటింగ్:1.5/5

పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...
Advertisement

తాజా వార్తలు