'లైగర్‌' యూఎస్‌ షెడ్యూల్‌ అప్డేట్‌

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న సినిమా లైగర్‌.

ఈ సినిమా కు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్‌ దర్శకుడు అనే విషయం తెల్సిందే.

భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా చివరి షెడ్యూల్‌ అమెరికాలో జరుగుతున్న విషయం తెల్సిందే.మైక్ టైసన్‌ ఈ సినిమా లో నటిస్తున్నాడు.

మైక్‌ టైసన్‌ మొదటి సారి ఒక ఇండియన్ సినిమా లో కనిపించబోతున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు పూరి ఈ సినిమా ను రఫ్పాడించేస్తున్నాడు.

తన గత సినిమా సూపర్‌ హిట్‌ అయిన నేపథ్యంలో ఈ సినిమాను అంతకు మించి అన్నట్లుగా తెరకెక్కిస్తున్నాడు.ఇక ఈ సినిమా లో విజయ్ దేవరకొండ పాత్ర నెవ్వర్ బిఫోర్ అన్నట్లుగా ఉంటుందని అభిమానులకు నమ్మకంగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

Advertisement
Vijay Devarakonda Liger Movie Usa Shooting Update Details, Ananya Panday, Liger,

ఇప్పటికే లుక్‌ రివీల్‌ అయ్యింది.బాక్సింగ్‌ నేపథ్యంలో ఉండే ఈ సినిమా మరో లెవల్‌ లో ఉంటుందనే నమ్మకంతో అంతా ఉన్నారు.

రికార్డు స్థాయి బడ్జెట్‌ తో రూపొందుతున్న ఈ సినిమా ను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నారు.బాలీవుడ్‌ లో కరణ్‌ జోహార్‌ ఈ సినిమాను విడుదల చేయబోతున్నాడు.

ఈయన ఒక నిర్మాతగా కూడా ఈ సినిమా కోసం వర్క్‌ చేస్తున్నాడు.ఛార్మి మరియు పూరిలు ఈ సినిమాను కరణ్‌ జోహార్‌ తో నిర్మిస్తుండగా అన్ని భాషల్లో ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ ఉంది.

Vijay Devarakonda Liger Movie Usa Shooting Update Details, Ananya Panday, Liger,

ఇలాంటి క్రేజీ మూవీ అమెరికా షెడ్యూల్‌ దాదాపుగా పూర్తి అయినట్లే అంటూ వార్తలు వస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మరో వారం రోజుల్లో లైగర్ టీమ్ ఇండియా కు తిరిగి రాబోతున్నారు.వీకెండ్‌ లో షూటింగ్ కు చిన్న బ్రేక్ ఇచ్చి యూనిట్‌ మొత్తం చిల్‌ అయ్యారు.

చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

విజయ్ దేవరకొండ గుర్రపు స్వారీ చేయగా ఇతర చిత్ర యూనిట్‌ సభ్యులు సరదాగా పార్టీలకు హాజరు అయ్యారు.

Advertisement

తాజా వార్తలు