'ఖుషి' చార్ట్ బస్టర్ కు ఇంకా తగ్గని క్రేజ్.. సెన్సేషన్ దిశగా పరుగులు!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda) క్రేజ్ ఏ రేంజ్ లో ఉందొ ఎవ్వరికి చెప్పడానికి కూడా సాధ్యం కావడం లేదు.

రోజురోజుకూ ఈ స్టార్ హీరో క్రేజ్ మరింతగా పెరిగి పోతుంది.

విజయ్ దేవరకొండ హీరోగా సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు( Samantha) హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ లవ్ రొమాంటిక్ అండ్ ఎమోషనల్ మూవీఖుషి(Khushi).

Vijay Devarakonda Khushi First Single Sensation, Vijay Devarakonda, Khushi Mov

విజయ్, సమంత ఇద్దరు కూడా ప్లాప్స్ తో బాధ పడుతున్నారు.విజయ్ లైగర్ సినిమాతో, సమంత శాకుంతలం ( Shaakuntalam )సినిమాతో భారీ ప్లాప్ లను అందుకున్న విషయం తెలిసిందే.మరి ఈ ప్లాప్ ను ఫ్యాన్స్ మర్చిపోవాలంటే ఇంతకంటే హిట్ సినిమా రావాలి.

అందుకే ఈ ఇద్దరు కూడా ఇప్పుడు కలిసి నటిస్తున్న ఖుషి సినిమా మీదనే భారీ అంచనాలు పెట్టుకున్నారు.శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.

Advertisement
Vijay Devarakonda Khushi First Single Sensation, Vijay Devarakonda, Khushi Mov

సమంత, విజయ్ కలిసి జంటగా నటిస్తున్న ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ఇటీవలే రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

ఫస్ట్ సింగిల్ రిలీజ్ కాగానే చార్ట్ బస్టర్ గా నిలిచింది.హేషమ్ అబ్దుల్ అందించిన సంగీతం శ్రోతలను విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ సాంగ్ క్రేజ్ ఇంకా తగ్గలేదని చెప్పాలి.

Vijay Devarakonda Khushi First Single Sensation, Vijay Devarakonda, Khushi Mov

ఇప్పుడు ఈ సాంగ్ ఏకంగా 60 మిలియన్ వ్యూస్ ను రాబట్టింది.ఈ క్రమంలోనే తాజాగా మైత్రి మూవీ మేకర్స్ పోస్ట్ చేస్తూ యూట్యూబ్ లో 60 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిందని అలాగే ఇంస్టాగ్రామ్ రీల్స్ లో 550K క్రాస్ అయ్యిందని చెబుతూ పోస్ట్ చేసారు.ఇక ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతున్నట్టు ఈ మధ్యనే ప్రకటించారు.

మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో పాన్ ఇండియన్ మూవీగా నిర్మిస్తున్న ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు