సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు కలయికలో తెరకెక్కిన లేటెస్ట్ లవ్ డ్రామా ఖుషి.
శివ నిర్వాణ దర్శకత్వంలో లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో పాన్ ఇండియన్ మూవీగా నిర్మించారు.
హేషం అబ్దుల్ సంగీతం అందించాడు.ఈయన సంగీతమే సినిమాకు ప్రాణం పోసింది అనే చెప్పాలి.
ఇక ఒక లవ్ స్టోరీని శివ నిర్వాణ( Shiva Nirvana ) మనసుకు హత్తుకునేలా తెరకెక్కించి మరో మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాడు.మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తో దూసుకు పోతున్న ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కూడా దూకుడు చూపిస్తుంది.మొదటి రోజు ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా 30.1 కోట్ల గ్రాస్ రాబట్టి ఊహించని ఓపెనింగ్స్ తో కుమ్మేసింది.
ఇక రెండవ రోజు కూడా ఏ మాత్రం తగ్గకుండా కలెక్షన్స్ సాధించి రెండు రోజుల్లోనే 50 కోట్ల మార్క్ దాటిపోయింది.ఇక మొదటి వీకెండ్ పూర్తి అయ్యేసరికి ఏకంగా 70 కోట్ల మార్క్ ను దాటేసింది.అలా ఖుషి సినిమా( Khushi movie ) మూడు రోజుల్లోనే 70.23 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.ఈ వీక్ లో మల్లి హాలిడేస్ కూడా ఉండడంతో మరింత కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది.
మొత్తానికి విజయ్ ఈ స్థాయి కలెక్షన్స్ ను రాబడుతూ బ్లాక్ బస్టర్ హిట్ అందుకునే దిశగా దూసుకు పోతున్నాడు.ఎట్టకేలకు ఖుషి సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో విజయ్ ఫ్యాన్స్ సైతం ఫుల్ ఖుషీగా ఉన్నారు.
గత 5 ఏళ్ల తర్వాత విజయ్ దేవరకొండకు వచ్చిన హిట్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు.చూడాలి మరి 100 కోట్ల మార్క్ టచ్ చేస్తుందో లేదో.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy