నెగటివ్ ఫేస్ చేయకపోతే ఇంటికి వెళ్ళిపోతా.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్!

నటుడు విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్( Family Star ) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఈ సినిమా అన్ని భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో ఈయన సౌత్ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయనకు సెలబ్రిటీలకు వచ్చే నెగెటివిటీ ( negativity ) గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

Vijay Devarakonda Comments About Negitivity In Social Media, Vijay Devarakonda,

సెలబ్రిటీలు అన్న తర్వాత ఫాన్స్ వారిని పొగుడుతూ ఉంటారు కానీ మరికొందరు విమర్శిస్తూ ఉంటారు అలాంటి నెగటివ్ కామెంట్లను మీరు ఎలా ఫేస్ చేస్తారో అంటూ ప్రశ్న వేశారు.ఈ ప్రశ్నకు విజయ్ దేవరకొండ సమాధానం చెబుతూ.నన్ను హీరో అవ్వు అంటూ నాకు ఎవరు సలహా ఇవ్వలేదు.

నాకు హీరో అవ్వాలనిపించింది ఇక్కడికి వచ్చాను.మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు మన పనిని ఇష్టపడే వాళ్ళు ఉంటారు.

Advertisement
Vijay Devarakonda Comments About Negitivity In Social Media, Vijay Devarakonda,

అలాగే నచ్చని వారు తిడుతూ ఉంటారు.ఇలా నువ్వు ఒక పని చేస్తున్నప్పుడు తిట్టేవాళ్ళు ప్రేమించే వాళ్ళు ఉంటారని వాటన్నింటినీ కూడా కచ్చితంగా ఫేస్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.

Vijay Devarakonda Comments About Negitivity In Social Media, Vijay Devarakonda,

ఇలాంటి నెగెటివిటీని ఫేస్ చేయలేకపోతే ఆ క్షణమే ఇంటికి వెళ్ళిపో నిన్నెవరు ఆపరు నీ స్థానంలో మరొకరు వస్తారు.ఈ ప్రపంచంలో గాంధీజీ లాంటి ఒక గొప్ప నేతను, మోడీ వంటి గొప్ప నాయకుడిని అంతెందుకు దేవుడిని కూడా విమర్శించి తిట్టేవాళ్ళు ఉన్నారు.వాళ్ల పనే అది అలాంటి వారి గురించి మనం పట్టించుకుంటే మన జీవితంలో ముందుకు వెళ్లలేము.

ప్రపంచంలో అది కూడా ఒక పార్ట్.మనం నచ్చినట్టు మన పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి, మన కోసం మనం కష్టపడాలి.

మనం చేసే పని కొన్ని వర్క్ అవుతాయి కొన్ని కావు అన్నింటిని తీసుకొని ముందుకు వెళ్లడమే జీవితం అంటూ ఈ సందర్భంగా విజయ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!
Advertisement

తాజా వార్తలు