అలాంటి సినిమాలు ఎప్పటికీ చేయను.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్!

నటుడు విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) త్వరలోనే ఫ్యామిలీ స్టార్( Family Star ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ విడుదల కాబోతున్నటువంటి తరుణంలో భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా విజయ్ దేవరకొండ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన తన సినిమాల గురించి కొన్ని విషయాలను వెల్లడించారు.

పెళ్లిచూపులు సినిమా ద్వారా హీరోగా పరిచయమైనటువంటి విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి గీతా గోవిందం వంటి సినిమాలతో స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్నారు.ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అవుతుందని, సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే ఈయన పొలిటికల్ లవ్, కామెడీ,యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇలా అన్ని జానర్ లోను సినిమాలు చేశారు.

Advertisement

ఈ క్రమంలోనే తాను ఇలా అన్ని జానర్ లోను సినిమాలు చేస్తాను కానీ ఒక్క జానర్ లో మాత్రం సినిమా అసలు చేయనని ఈయన తెలిపారు.నేను హర్రర్( Horror Movies ) సినిమాలలో అసలు నటించనని తెలిపారు.నేనెప్పుడూ కూడా ఎక్కువ మంది చూసే సినిమాలను మాత్రమే చేస్తానని వెల్లడించారు.

  హర్రర్ సినిమాలకు అందరూ కనెక్ట్ కారు.కనుక అలాంటి సినిమాలకు నేను దూరంగా ఉంటాను అంటూ ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ కామెంట్స్ చేశారు.

ఇక ఈయన కామెంట్స్ విన్న అభిమానులు అయితే మనం విజయ్ దేవరకొండను హర్రర్ సినిమాలలో చూడలేమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

త్రిష, నయనతారలను రష్మిక వెనక్కు నెట్టేసిందా.. ఆమె రెమ్యునరేషన్ ఎంతంటే?
Advertisement

తాజా వార్తలు