కోలీవుడ్ స్టార్ హీరోల్లో దళపతి విజయ్ జోసెఫ్ (Thalapathy Vijay) ఒకరు.ఈయన ప్రస్తుతం నటిస్తున్న సినిమా లియో(LEO Movie).
ఈ సినిమా భారీ అంచనాలు నెలకొన్న తమిళ్ క్రేజీ ప్రాజెక్ట్ గా పాన్ ఇండియా బరిలో ఉంది.విజయ్ మొన్న సంక్రాంతికి వారిసు సినిమాతో వచ్చి మరో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయ్యి డీసెంట్ హిట్ అందుకుంది.ఇక ఈ సినిమా తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తన నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేసి షూటింగ్ కూడా మొదలెట్టాడు.
లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో ఈ సినిమా గ్రాండ్ గా తెరకెక్కుతుంది.వీరి కాంబోలో రాబోతున్నట్టు రెండవ సినిమా ఇది.అంతేకాదు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమైన ఈ సినిమాపై తమిళ్ లో ఇప్పుడే ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి.
లోకేష్ గత సినిమా విక్రమ్( Vikram ) ఎంత మ్యాజిక్ క్రియేట్ చేసిందో చెప్పాల్సిన పని లేదు.కమల్ హాసన్ కెరీర్ కు బిగ్ హిట్ గా నిలిచింది.మరి విక్రమ్ తర్వాత లోకేష్ విజయ్ తో చేస్తున్న సినిమా కావడంతో మరింత క్రేజీగా మారింది.
ఇదిలా ఉండగా ఈ సినిమాలో విజయ్ తో పాటు పలువురు స్టార్స్ భాగం కానున్నారు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.
మరి తాజాగా కమల్ హాసన్( Kamal Haasan ) కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్టు కన్ఫర్మ్ అయిపొయింది.అధికారికంగా అనౌన్స్ చేయకపోయినా ఆర్ట్ డైరెక్టర్ సతీష్ కుమార్ చేసిన పోస్ట్ తో కమల్ ఉన్నట్టు కన్ఫర్మ్ అయ్యింది.ఈయన ఎక్కడ కమల్ పేరు రివీల్ చేయకుండానే ఒక గ్రద్ద ఫోటో పెట్టి ఈగల్ ఈజ్ కమింగ్ అంటూ పోస్ట్ చేసాడు.
విక్రమ్ లో కమల్ థీమ్ సాంగ్ ను బట్టి కమల్ ఈ సాంగ్ లో కన్ఫర్మ్ అయ్యాడు.
త్వరలోనే ఈ సినిమా షూట్ లో కూడా కమల్ జాయిన్ కానున్నట్టు తెలుస్తుంది.చూడాలి విక్రమ్ లింకప్ ను ఈ సినిమాకు ఎలా కనెక్ట్ చేస్తాడో.మరి ఈ సినిమా షూటింగ్ ను ఏప్రిల్ లేదా మే నాటికీ మొత్తం కంప్లీట్ చేసేసి అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమాను సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.ఇక త్రిష (Trisha Krishnan) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.
అలాగే సంజయ్ దత్ విలన్ రోల్ ప్లే చెయ్యనున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy