వీడియో: యమ స్పీడ్‌గా వెళ్తూ బైక్ హ్యాండిల్ వదిలేశాడు.. తర్వాతేమైందో చూడండి..

ఈరోజుల్లో చాలామంది యువతీ యువకులు ఇన్‌స్టా రీల్ కోసం ప్రాణాలకు తెగిస్తున్నారు.

ఈ మోజులో పడి చివరికి ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు తాజాగా మరొక యువకుడు రీల్స్(Reels) కోసం ఒక పిచ్చి స్టంట్ చేసి ఆసుపత్రి పాలయ్యాడు.

అతని బైక్‌ స్టంట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇన్‌స్టాగ్రామ్(Instagram) యూజర్ ‘its_saddam3’ పోస్ట్ చేసిన ఈ వీడియోలో, ఒక యువకుడు బైక్‌పై వేగంగా ప్రయాణిస్తూ, ప్రమాదకరమైన స్టంట్ చేయడానికి ప్రయత్నించి తీవ్రంగా గాయపడ్డాడు.

రోడ్డుపక్కన నిలబడి తన స్నేహితుడు రీల్ రికార్డ్ చేస్తుండగా, బైక్‌ను వేగంగా నడుపుతూ, హ్యాండిల్‌ను వదిలివేసి, కెమెరా(Camera) వైపు చూస్తూ పోజు ఇవ్వడానికి ప్రయత్నించాడు.కానీ, రోడ్డు కొద్దిగా కుడి వైపుకి తిరిగి ఉంది.

అతను కెమెరా వైపు ఫోజులు ఇచ్చేటప్పుడు తన రెండు చేతులను హ్యాండిల్ పైనుంచి తీసేశాడు.రోడ్డు కర్వ్ ఉంది కాబట్టి బైక్‌ను నేరుగా వెళ్లి రైలింగ్‌ను ఢీ కొట్టింది.

Advertisement

అంత వేగంగా అతను హ్యాండిల్ మళ్ళీ పట్టుకుని అవకాశమే దక్కలేదు.ఈ ప్రమాదకరమైన స్టంట్‌కు ప్రయత్నించినందుకు యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

సోషల్ మీడియాలో లైక్స్ కోసం ప్రాణాలను పణంగా పెట్టుకోవడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన స్పష్టంగా తెలియజేస్తుంది.

డిసెంబర్ 5న అప్‌లోడ్ చేసిన ఈ వీడియో కేవలం ఒక్క రోజులోనే 454,000 లైక్‌లను దాటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది.కొంతమంది ఈ యువకుడి భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ, "నీకు బాగా ఉందా? నువ్వు గాయపడలేదా?" అని కామెంట్లు చేశారు.మరికొందరు అతిగా ప్రవర్తించినందుకు అతడిని విమర్శిస్తూ, "నీకు ఎన్ని ఎముకలు విరిగి ఉంటాయి?" అని వ్యంగ్యంగా అన్నారు."అతను యముడిని కలవాలని అనుకున్నాడా?" అని కొందరు అన్నారు.మరికొందరు "ప్రమాదం ఎలా ఉందో ఆస్వాదించావా?" అని ఎద్దేవా చేశారు.ఏదేమైనా మూర్ఖత్వపు ప్రవర్తనలతో ఇతరులను ఆకట్టుకోవడానికి ప్రయత్నించడం మానుకోవాలి.

లేదంటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి అనడంలో సందేహం లేదు.వల్ల తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయని ఈ ఘటన స్పష్టంగా తెలియజేస్తుంది.

వారంలో 3 సార్లు ఈ డ్రింక్ తాగితే.. మ‌ల్లెతీగ‌లా మార‌తారు!
Advertisement

తాజా వార్తలు