వీడియో: ఇసుకపై విరాట్ కోహ్లీ బొమ్మ గీసిన పాక్ ఫ్యాన్స్.. చూస్తే ఫిదా అవుతారంతే..!

టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో భాగంగా పాకిస్థాన్‌పై టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే.

నిజానికి ఈ మ్యాచ్‌లో ఇండియన్‌ స్టార్ ప్లేయర్లందరూ ముందుగానే అవుట్ అయ్యారు.

దాంతో ఫ్యాన్స్ నిరాశ పడిపోయారు.ఆ సమయంలో విరాట్ కోహ్లీ సింహం వలె విరుచుకుపడి పరుగుల వరద పారించాడు.

దాంతో ఇండియా గెలుపు సాధించింది.ఈ క్రికెట్ మ్యాచ్‌ను ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ లవర్స్ చూశారు.

కోహ్లీ ఆటకు ఫ్యాన్స్ అయిపోయారు.అలాంటి విదేశీ ఫ్యాన్స్‌లో కొందరు తాజాగా కోహ్లీని ప్రశంసిస్తూ ఇసుకలో అతడి బొమ్మను గీశారు.

Advertisement

ఆ సాండ్ ఆర్ట్ ఎంత పెద్దగా ఉందంటే.అది విమానంలో వెళ్తున్న వారికి కూడా కోహ్లీ బొమ్మ అని క్లారిటీగా తెలుస్తుంది.

బలూచిస్థాన్‌కు చెందిన ఈ టాలెంటెడ్ ఇసుక స్కెచర్లు ఇసుకపై కోహ్లి భారీ చిత్రాన్ని పాక్ గడ్డపైనే రూపొందించారు.ఈ అభిమానులలో యువ కళాకారుల నుంచి చిన్న పిల్లవాడి వరకు కూడా పాల్గొన్నారు.

భారీ స్కెచ్‌లో "లవ్ ఫ్రమ్ ఆర్‌ఎ గడ్డాని" అనే సందేశంతో కోహ్లీ ప్రతిమను అద్భుతంగా చిత్రించారు.ఆర్టిస్టులు ఈ ఆర్ట్ వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో విడుదలైంది.

గీసిన స్కెచ్ ఫొటోలు, వీడియోను కళాకారులలో ఒకరైన సమీర్ షౌకత్ పోస్ట్ చేశారు.కాగా ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది.

కఠినమైన చర్మాన్ని సూపర్ స్మూత్ గా మార్చే సింపుల్ టిప్ మీకోసం!

ఈ వీడియో చూసిన నెటిజన్లు అభిమానానికి, ప్రేమకి సరిహద్దులు లేవు అని కామెంట్లు చేస్తున్నారు.విరాట్ కోహ్లీ దృష్టికి ఈ వీడియో త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.కాగా అక్టోబర్ 30న పెర్త్‌లో దక్షిణాఫ్రికా జట్టుతో టీమిండియా టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ ఆడనుంది.

Advertisement

భారత కాలమానం ప్రకారం మ్యాచ్ సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమవుతుంది.

తాజా వార్తలు