జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో గద్దర్ చివరి మాటలు వీడియో..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తన ఇంస్టాగ్రామ్ లో గద్దర్ ( Gaddar ) తన గురించి మాట్లాడిన వీడియో పోస్ట్ చేయడం జరిగింది.

తమ్ముడా పవన్ అనే టైటిల్ కలిగిన ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ ని పొగుడుతూ దేశం యువతతో నిండి ఉందని గద్దర్ పాట రూపంలో తెలియజేశారు.

యువతరానికి నాయకుడు కావాలి.తమ్ముడు పవన్ కాలం గొప్పది.

దానికి రుచి వాసన ఉండదు దానితో కలిసిపోవాలి.రాజకీయాలలో తెగింపు ఉండాలి.

అంటూ పవన్ కళ్యాణ్ కి పలు సూచనలు తెలియజేస్తూ గద్దర్ పాటను ఆలపించారు.ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది.

Advertisement

వీడియోలో గద్దర్ తో అనేక సందర్భాలలో పవన్ కళ్యాణ్ దిగిన ఫోటోలు ఉన్నాయి.

ప్రజా గాయకుడు గద్దర్( Gaddar ) మరణించిన విషయాన్ని తెలుసుకున్న పవన్ ఫోటో ఒకటిన నిన్న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఆయన పార్థివ దేహానికి( Gaddar Demise ) నివాళులు అర్పించి గద్దర్ కుటుంబ సభ్యులను ఓదార్చడం జరిగింది.పవన్ కళ్యాణ్ కి గద్దర్ అంటే ఎంతో ఇష్టం.ఈ విషయాన్ని చాలా రాజకీయ మరియు సినిమా వేదికలపై కూడా తెలియజేయడం జరిగింది.

గద్దర్ తో ఎంతో సన్నిహితంగా ఉండే పవన్.ఆయన అనారోగ్యానికి గురై హాస్పిటల్లో ఉన్న సమయంలో పరామర్శించడం జరిగింది.

అయితే హఠాత్తుగా ఆయన మరణించడంతో గద్దర్ భౌతికకాయం వద్ద పవన్ కళ్యాణ్ కన్నీరు పెట్టుకోవడం జరిగింది.ఈ క్రమంలో తనతో మాట్లాడిన చివరి పాటల వీడియో పవన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతుంది.

మీ ఇంట్లో బుద్ధుని విగ్రహాన్ని పెట్టుకున్నారా..? అయితే ఈ నియమాలు పాటించండి..!
Advertisement