వీడియో: పాకిస్థాన్ ఆడిన చెత్త ఆటకు ఫ్యాన్స్ ఎలా వెక్కెక్కి ఏడుస్తున్నారో..!

2024 టీ20 ప్రపంచకప్( 2024 T20 World Cup ) మ్యాచ్‌లు చాలా థ్రిల్లింగ్‌గా కొనసాగుతున్నాయి.

రీసెంట్‌గా డల్లాస్‌లోని గ్రాండ్ ప్రెయిరీ స్టేడియంలో( Grand Prairie Stadium in Dallas ) అమెరికా, పాకిస్థాన్‌ జట్లు తలపడ్డాయి.

ఈ మ్యాచ్‌లో యూఎస్ఎ పాకిస్థాన్‌ టీమ్‌పై ఊహించని విజయం సాధించింది.ఈ మ్యాచ్ అంచనాలకు మించి ఉత్కంఠభరితంగా సాగింది.

చివరికి సూపర్ ఓవర్‌లో అమెరికా జట్టు గెలిచింది.వరల్డ్ క్లాస్ టీమ్ పాక్ అనేక విజయావకాశాలను చేజేర్చుకుంది.

, ముఖ్యంగా కెప్టెన్ బాబర్ ఆజమ్‌ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు.దాంతో పాక్ ఫ్యాన్స్ పసికూన యూఎస్ఎపై కూడా గెలవలేకపోయారని క్రికెటర్లపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

Advertisement
Video How The Fans Are Crying Because Of The Worst Game Played By Pakistan, 2024

ఈ క్రమంలోనే ఒక అభిమాని చాలా ఎమోషనల్ స్పీచ్ ఇచ్చింది.ఆమెకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ లేడీ ఫ్యాన్ పాక్ టీమ్ పూర్ బ్యాటింగ్, ఫీల్డింగ్, క్యాచ్‌లు డ్రాప్ చేయడం పట్ల అసహనాన్ని వ్యక్తం చేసింది.ఆమె పాక్ జట్టుకు మద్దతు ఇవ్వడానికి అన్ని మానేసుకొని స్టేడియానికి వచ్చింది చాలా డబ్బులు కూడా ఖర్చు చేసింది కానీ పాక్ మాత్రం చాలా చెత్తగా ఆట ఆడింది.

దాంతో ఆమె తీవ్ర నిరాశకు గురైంది.ఆవేదనతో కెమెరా ముందు బాగా తిట్టిపోసింది.

Video How The Fans Are Crying Because Of The Worst Game Played By Pakistan, 2024

మరొక వీడియోలో, ఒక పాకిస్థాన్‌ ( Pakistan )అభిమాని తన నిరాశను వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడింది.మాజీ చాంపియన్లు అయిన పాక్ క్రికెటర్లు ఎలాంటి అనుభవం లేని అమెరికా జట్టు చేతిలో ఓడిపోవడం చూసి ఆమె చాలా బాధపడింది.పాక్‌ క్రికెట్ జట్టు గతంలో కూడా ఇలాంటి అవమానకర ఓటములను ఎదుర్కొంది, ముఖ్యమైన మ్యాచ్‌లలో జింబాబ్వే, ఆఫ్ఘనిస్తాన్ వంటి జట్ల చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయింది.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

పాక్ ఫ్యాన్స్ ఏడుస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి.

Video How The Fans Are Crying Because Of The Worst Game Played By Pakistan, 2024
Advertisement

ఈ ఓటములను బట్టి చూస్తుంటే పెద్ద టోర్నమెంట్లలో ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో పాక్ టీమ్‌కు తెలియదని స్పష్టం అయ్యింది.అభిమానులు 1999లో బంగ్లాదేశ్‌, 2007లో ఐర్లాండ్‌ పాకిస్థాన్‌ను చిత్తుచిత్తుగా ఓడించాయని గుర్తుతెచ్చుకున్నారు.ఈ జట్టు గత వైభవాన్ని తిరిగి పొందాలంటే, లోపాలను సరిదిద్దుకోవాలి.

ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో బాగా ఆడటం నేర్చుకోవాలి.

తాజా వార్తలు