వీడియో: కారు బీభత్సం.. కానిస్టేబుల్‌ను అంత దూరం ఈడ్చుకెళ్లిన డ్రైవర్..!

ముంబైలో ఒక ఘోరం చోటు చేసుకుంది.ఖర్ఘర్ సెక్టార్ 8కి చెందిన ఆకాష్ జంగీర్ (28) అనే ఓ ఇంజనీర్ కారుతో బీభత్సం సృష్టించాడు.

జులై 9వ తేదీ శనివారం పది గంటల ప్రాంతంలో ఇతడు కారుతో రోడ్డు పైకి వచ్చాడు.ఇష్టారాజ్యంగా నడుపుతూ తోటి వాహన దారులకు హడల్ పుట్టించాడు.

ఖర్ఘర్‌ లోని సియోన్-పన్వెల్ హైవేకి దగ్గరగా ఉన్న కోప్రా బ్రిడ్జిపై అతడు రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేశాడు.అయితే అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ నామ్ దేవ్ గడేకర్ (32) వెంటనే అప్రమత్తం అయ్యాడు.

అలా రాంగ్ రూట్ లో నడిపితే ప్రమాదమని ఆకాష్ ను కారు ఆపమని విజ్ఞప్తి చేశాడు.అంతేకాదు కారు ముందుకు వచ్చాడు.

Advertisement

అయిత్ జంగీర్ కారుకి బ్రేక్ వేయకుండా అలాగే దూసుకెళ్లాడు.ఇది ఊహించని గడేకర్ తప్పించుకోలేకపోయాడు.

చేసేదిలేక రెప్పపాటు సమయంలోనే కారు బానెట్‌ను గట్టిగా పట్టుకున్నాడు.ఆ తర్వాత కారు ఆపమని ఎంత సైగలు చేసినా ఆకాష్ మాత్రం అర కిలోమీటరు వరకు కారును అలాగే తీసుకెళ్లాడు.

ఈ సమయం అంతా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ట్రాఫిక్ కానిస్టేబుల్ బానెట్‌కు వేలాడాడు.ఈ దృశ్యం చూసిన మరొక కానిస్టేబుల్ షాక్ తిన్నాడు.

అనంతరం ఒక బైక్ పై ఎక్కి ఆకాష్ కారును ఛేజ్ చేశాడు.ఇంతలోనే మరొక వ్యక్తి తన వాహనాన్ని ఆకాష్ కారుకు అడ్డం పెట్టటంతో అతడు కారుని ఆపాడు.

Bet365 бонусная программа: разбор механик, ограничений и реальной ценности
పైసా ఖర్చు లేకుండా ముఖంపై మచ్చలను పోగొట్టుకోవాలనుకుంటే ఇలా చేయండి!

అలా కానిస్టేబుల్ ప్రాణాలు కాపాడాడు.ఈ షాకింగ్ దృశ్యాలన్నిటినీ కారులోని వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు.

Advertisement

అది కాస్తా వైరల్ అయ్యింది.ఇంజనీర్ ఆకాష్ పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు.

అనంతరం అతడిని అరెస్ట్ చేశారు.