వీడియో: భారీ చెట్టు కింద కూర్చున్న వ్యక్తి.. ఒక్కసారిగా కూలడంతో..?

అనుకోని ప్రమాదాలు చాలా మందిని బలి తీసుకుంటూ ఉంటాయి.ఒక్కోసారి పెద్ద ప్రమాదాలు చోటుచేసుకున్నా వాటి నుంచి కొందరు ఎలాంటి గాయాలు లేకుండా బతికి బయటపడగలుగుతుంటారు.

దానిని ప్యూర్ లక్కుగా మనం అభివర్ణించవచ్చు.అయితే తాజాగా ఇలాంటి ఒక అదృష్టవంతుడికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ఫిలిప్పీన్స్‌( Philippines )లోని కావిటే సిటీకి చెందిన ఈ వ్యక్తి అద్భుతంగా ప్రమాదం తప్పించుకున్నారు.

ఆయన తన ఇంటి బయట వరండాలో రిలాక్స్‌గా కూర్చొని ఉండగా, ఆయన వెనక ఉన్న భారీ వృక్షం పడిపోయింది.ఈ షాకింగ్ ఘటన సెక్యూరిటీ కెమెరాలో రికార్డయ్యింది.వైరల్ హాగ్ దానిని ఆన్‌లైన్‌లో పంచుకుంది.

Advertisement

ఆ వీడియో షేర్ చేసిన కొంతసేపటికి వైరల్ అయ్యింది.చాలా మంది నెటిజన్లు ఆ వ్యక్తి ఎలా ప్రమాదం నుంచి తప్పించుకున్నాడో చూసి ఆశ్చర్యపోయారు.

వీడియో కేవలం 56 సెకన్లు మాత్రమే ఉంటుంది కానీ చాలా భయానకంగా సాగింది.ఆ వ్యక్తి సౌకర్యంగా కూర్చొని ఉన్నప్పుడు, ఎలాంటి వార్నింగ్ సైన్స్ ఇవ్వకుండా వృక్షం ఒక్కసారిగా కుప్పకూలింది.

అది అతడి తల మీద పడలేదు.తలకు ఇరువైపులాహం పడింది.

దాంతో సదరు యువకుడు ఒక్కసారిగా షాక్ అవుతాడు.ఇంత పెద్ద చెట్టు తనకు కొన్ని అంగుళాల దూరంలో పడిన అతడికి ఎలాంటి గాయాలు కాకపోవడం విశేషం.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
వీడియో వైరల్ : ఏంటి రింకూ సింగ్ మరీ డబ్బులు అంత ఎక్కువయ్యాయ?

వీడియో పోస్ట్ చేసిన తర్వాత, ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేసింది.చాలా మంది దానిపై వ్యాఖ్యానించారు, వారి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.ఒక వ్యక్తి "దేవుడు ఎప్పుడూ మంచివాడే" అని అన్నారు.

Advertisement

మరొకరు "సరైన స్థలం, తప్పుడు సమయం అని గ్రీకులో ఉంది, అంటే అదృష్టం కలిసి వచ్చింది కానీ సమయం మాత్రం చెడ్డది అని వ్యాఖ్యానించారు.ప్రస్తుతం వైరల్‌ అవుతున్న వీడియోను చూడాలంటే ఈ లింకు https://youtu.be/QBc5kstQgtM?si=XbkE_6QYQ1EyqGnKపై క్లిక్ చేయండి.దీనికంటే ముందు ఇలాంటి వీడియోలు చాలానే వైరల్ అయ్యాయి.

ఒక రీసెంట్ వీడియోలో మోటార్ బైక్ రేసర్ ట్రక్కు, కారు క్రాష్ నుంచి వెంట్రుక వాసిలో బయటపడ్డాడు.దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది.

తాజా వార్తలు