కృష్ణం రాజు అప్పట్లోనే అంత కూడబెట్టారా.. ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

రెబల్ స్టార్ కృష్ణం రాజు గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు.ఈయన రెబల్ స్టార్ గా మారడానికి ముందు చాలా కష్టపడ్డారు.

ఈయన కెరీర్ లో ముందు విలన్ గా చాలా సినిమాలు చేసారు.విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దాదాపు 10 ఏళ్ల పాటు కష్టపడ్డాకనే ఈయన హీరోగా మారి స్టార్ డమ్ అందుకున్నారు.

అయితే కృష్ణం రాజు గత కొన్ని రోజులుగా అనారోగ్యాలతో బాధ పడుతున్నారు.ఇక ఈ రోజు తెల్లవారు జామున కృష్ణం రాజు (83) చికిత్స పొందుతూ 3.25 గంటలకు కన్నుమూసినట్టు తెలుస్తుంది.ఈయన మరణ వార్త విని టాలీవుడ్ లో విషాదం నెలకొంది.

ఈయన ఫ్యాన్స్ అంతా ఈయన లేరనే వార్త తెలియడంతో దుఃఖ సాగరంలో మునిగి పోయారు.ఈయన మరణం తర్వాత ఈయన గురించిన చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Advertisement
Veteran Actor Krishnam Raju Assets, Rebel Star Krishnam Raju, Prabhas, Krishnam

ఈ క్రమంలోనే ఈయన ఆస్తుల గురించి కూడా వార్తలు వస్తున్నాయి.ఈయనకు ఆస్తిపాస్తులు చాలానే ఉన్నాయని మొత్తం 800 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం.

ఈయన కెరీర్ లో ఈయన సంపాదించింది కాకుండానే ఈయన పెద్దల నుండి కూడా భారీ ఆస్తులు వారసత్వంగా వచ్చాయట.

Veteran Actor Krishnam Raju Assets, Rebel Star Krishnam Raju, Prabhas, Krishnam

ప్రెజెంట్ హైదరాబాద్ లో ఉంటున్న ఇల్లు 18 కోట్లట.అది కాకుండానే ఇక్కడే మరొక మూడు ఇల్లు, ఫామ్ హౌస్, చెన్నై లో కూడా ఇల్లులు ఉన్నట్టు తెలుస్తుంది.ఇంకా ఈయనకు వారసత్వంగా మొగల్తూరులో వందల ఎకరాలు వచ్చిందట.

అక్కడ కూడా భవనం ఉందని తెలుస్తుంది.ఇంకా ఈయనకు కార్లు కూడా కోట్ల రూపాయల ఖరీదైనవి ఉన్నాయట.

నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ టీ మీరు తాగాల్సిందే!

ఇలా మొత్తంగా ఈయన సంపాదించిన దానితో పాటు తాత ముత్తాతల ఆస్తులు కూడా బాగా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు