తవ్వుకొన్న వాడికి తవ్వుకొన్నంతా బంగారం.. ఎక్కడో తెలుసా..?!

ప్రస్తుతం బంగారం ధర ఆకాశాన్ని అంటుతున్న విషయం అందరికీ తెలిసిందే.

ప్రస్తుతం బంగారం ధర చూస్తే మధ్యతరగతి కుటుంబాల వారు బంగారం కొనడం అంటే చాలా కష్టంగా మారింది.

పసిడి ని గ్రాములలో కొనటం జరిగిన కానీ లక్షల్లో ఖర్చవుతుంది.ఇలాంటి సమయంలో ప్రజలకి ఒక్కసారిగా బంగారం కొండ కనిపిస్తే ఎలా ఉంటుంది చెప్పండి.

ఇంకేముంది తట్ట, పార తీసుకొని తవ్వుకొని వెళ్లిపోవడమే తరువాయి.ప్రస్తుతం కూడా ఇదే జరిగింది.

అదెక్కడ అంటే డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో లో ఈ పరిస్థితి ఏర్పడింది.ఆ దేశంలో ఉన్న ఓ కొండలో తవ్వేకొద్దీ బంగారం బయట పడుతుంది.

Advertisement

ఈ విషయం ఆ ప్రాంతంలోనే ఉన్న స్థానిక ప్రజలకు తెలుసుకోవడంతో అక్కడ ఉన్న ప్రజలు పెద్ద పెద్ద సంచులను తీసుకోవచ్చి ఇంటికి బంగారం రంగు ఉన్న రాళ్ళను తవ్వుకొని తీసుకు వెళుతున్నారు.వారు సేకరించిన మట్టిలో మధ్యలో ఏకంగా 60 నుంచి 90 శాతం వరకు బంగారం ఉన్నట్లు అక్కడి శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

చేతికి దొరికిన వస్తువుతో మట్టిని తవ్వి బంగారం రంగులో కనపడిన ప్రతి రాయిని అక్కడి వారు తమ వెంట తీసుకు వెళ్తున్నారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మార్గాల్లో తెగ వైరల్ గా మారింది.ఇలా మట్టిని త్రవ్వడానికి ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రజలు భూమిని తవ్వకంలో అనేక మంది తొక్కిసలాటలో ఇబ్బంది పడుతున్నారు.అలా వారు ఆ మట్టిని తవ్వితే తర్వాత చాలామంది దాన్ని ఇంటికి తీసుకువెళ్ళి శుభ్రపరుచుకుని బంగారాన్ని వేరు చేస్తుండగా మరికొందరైతే ఆ ప్రాంతంలోనే దానిని శుభ్రం చేసి అందులో ఉన్న బంగారాన్ని మాత్రమే ఇంటికి తీసుకువెళ్తున్నారు.

దీంతో ఆ దేశ ప్రభుత్వం మైనింగ్ శాఖ అప్రమత్తం కావడంతో ఆ కొండపై ఉన్న బంగారాన్ని తవ్వడానికి అనుమతులు ఇవ్వలేదు.ఉత్తర్వులు ఇచ్చేవరకు అక్కడ ఎవరు మైనింగ్ చేయకూడదని ప్రభుత్వం నిషేధం విధించింది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

కాంగో దేశంలో బాగా ప్రసిద్ధి చెందిన వజ్రాలు, అనేక రకాల ఖనిజాలు, కలప లాంటి సహజ నిక్షేపాలు పెద్ద ఎత్తున ఉన్నాయి.వీటితో పాటు అక్కడ పెద్ద ఎత్తున బంగారం నిక్షేపాలు కూడా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు