Venu Swamy :ఒరేయ్ ఆజామూ అంటూ మరోసారి ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన వేణుస్వామి..!!

సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఫేమస్ అయిన వేణు స్వామి ( Venu Swamy ) జాతకం ఈ మధ్యకాలంలో చెప్పింది చెప్పినట్లుగా జరగడం లేదు.

ఎందుకంటే ఈయన ప్రభాస్ సలార్ విషయంలో సంచలన కామెంట్లు చేశారు.

ప్రభాస్ ( Prabhas ) తో ఏ నిర్మాత సినిమా చేయాలన్నా సరే ఒకసారి జాతకం చూపించుకోవాలి అన్నారు.అంతే కాదు ప్రభాస్ నటించిన సినిమాలన్నీ అట్టర్ ప్లాఫ్ అవుతాయని, ప్రభాస్ కెరియర్ ఇక ముగిసింది అంటూ సంచలన కామెంట్లు చేశారు.

అంతేకాకుండా రాజకీయాల్లో తెలంగాణలో ఈసారి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారు అని చెప్పారు.ఇక ఈయన చెప్పిన ఈ రెండు మాటలు నిజం కాలేదు.

ఎందుకంటే ఈసారి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయ్యారు.

Venu Swamy Once Again Made Shocking Comments On Prabhas
Advertisement
Venu Swamy Once Again Made Shocking Comments On Prabhas-Venu Swamy :ఒరే�

అలాగే సలార్ సినిమా ( Salaar movie ) ప్లాఫ్ అవుతుంది అనుకుంటే బ్లాక్ బస్టర్ హిట్ అయింది.దీంతో వేణు స్వామి పై సోషల్ మీడియాలో మీమ్స్,ట్రోల్స్ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు.అయితే తాజాగా ప్రభాస్ సినిమా హిట్ అయింది అనే ఆనందంలో మునిగిపోయి వేణు స్వామిని అంతగా ప్రభాస్ అభిమానులు పట్టించుకోవడం లేదు.

కానీ ఇలాంటి టైంలో మళ్లీ ప్రభాస్ పై పరోక్షంగా షాకింగ్ కామెంట్లు చేశారు వేణు స్వామి.

Venu Swamy Once Again Made Shocking Comments On Prabhas

ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో ఓ షాకింగ్ పోస్ట్ పెట్టారు.అందులో ఏముందంటే.ఒరేయ్ ఆస్ట్రేలియా ఆజాము.

సూపర్ స్టార్ అంటే చేసిన నాలుగు సినిమాల్లో ఒక్క సినిమా హిట్ అవడం కాదురా.విడుదలైన సినిమాలన్నీ 90% హిట్ కొట్టడం అంటూ ఆస్ట్రేలియా ఆజాము అని ఒక పేరు పెట్టి వీడియో షేర్ చేశారు.

అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో రాలేడా..?
రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...

అయితే దీన్ని ప్రభాస్ అభిమానులు ప్రభాస్ పై పరోక్షంగా వేణు స్వామి ఇలా కౌంటర్ ఇస్తున్నాడు అని గ్రహించి ఆయనపై కోపంగా పోస్టులు పెడుతున్నారు.అంతే కాదు పరోక్షంగా ప్రభాస్ ని సూపర్ స్టార్ కాదు అని చెప్పుకు రావడం ఆయన అభిమానులను మరింత కోపానికి గురిచేసింది.

Advertisement

దీంతో వేణు స్వామి పై గుర్రుగా ఉన్నారు ప్రభాస్ అభిమానులు.

తాజా వార్తలు