వామ్మో.. ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి ఆస్తుల విలువ తెలిస్తే మాత్రం అవాక్కవ్వాల్సిందే!

ఆస్ట్రాలజర్ వేణు స్వామి( Astrologer Venuswamy ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తరచూ సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలు చెబుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.

ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోయిన్లు స్టార్ హీరోల జాతకాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసి లేనిపోని వివాదాలను కాంట్రవర్సీలను కొని తెచ్చుకున్న విషయం తెలిసిందే.దాంతో ఆయా హీరో హీరోయిన్ల అభిమానులు వేణు స్వామి పై దారుణంగా ట్రోలింగ్స్ కూడా చేశారు.

కాగా ఇప్పటివరకు వేణు స్వామి చాలా మంది సెలెబ్రిటీలపై చెప్పిన జ్యోతిష్యాలు నిజమైనట్లు ప్రచారం కూడా ఉంది.

వేణు స్వామి చేసే వ్యాఖ్యలు యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతూనే ఉంటాయి.ఇటీవల నాగచైతన్య ఎంగేజ్మెంట్( Nagachaitanya Engagement ) తర్వాత సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఆయన మరోసారి ట్రోల్స్ కు గురైన విషయం తెలిసిందే.ఆ సంగతి పక్కన పెడితే తాజాగా వేణు స్వామి ఆస్తులకు( Venuswamy Assets ) సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది.

Advertisement

మరి వేణు స్వామి ఇప్పటివరకు ఎంత ఆస్తులు సంపాదించారు అన్న వివరాల్లోకి వెళితే.ఆయన సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.ఒక ఇంటర్వూలో ఆయనే స్వయంగా తన ఆస్తి గురించి చెప్పుకొచ్చాడు.

వేణు స్వామికి ఒక వైన్ షాప్, ఒక పబ్, రేంజ్ రోవర్ కార్, ఇంకా ఇతర వ్యాపారాలు చాలానే ఉన్నాయట.

అలా తన బిజినెస్‌ల నుంచి వచ్చే ఆదాయం నెలకు లక్షల్లోనే ఉంటుందట.మొత్తంగా ఇప్పటివరకు ఆయన సంపాదించిన ఆస్తులు రూ.10 కోట్లకు పైనే ఉంటాయని ఇన్ సైడ్ టాక్.అయినా భార్య వాణి ప్రముఖ సింగర్ అన్న విషయం మనందరికీ తెలిసిందే.

ఆమె కూడా డబ్బులు బాగానే సంపాదించిందని చెప్పవచ్చు.అయితే తరచూ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కి గురవుతూ లేనిపోని కాంట్రవర్సీలు కొని తెచ్చుకునే వేణు స్వామీ ఆస్తిపాస్తులు కలిసి నెటిజన్స్ సైతం షాక్ అవుతున్నారు.

కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు
Advertisement

తాజా వార్తలు