విక్రమ్‌ కోసం రాబోతున్న వెంకీ మామ.. ఈనాడు తర్వాత మళ్లీ ఇప్పుడు

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన విక్రమ్‌ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.

జూన్ 3వ తారీకున విడుదల కాబోతున్న విక్రమ్‌ సినిమా కు దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున ప్రమోషనల్‌ ఈవెంట్స్ ను నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే ఉత్తర భారతంలో ట్రిప్ ను ముగించిన యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్ రేపు అంటే 31 వ తారీకున హైదరాబాద్‌ లో విక్రమ్‌ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో పాల్గొనబోతున్నాడు.శ్రేయాస్ మీడియా వారి ఆధ్వర్యంలో సాగబోతున్న విక్రమ్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో కమల్‌ హాసన్ కోసం విక్టరీ వెంకటేష్ రాబోతున్నాడు.

వీరిద్దరు కలిసి ఈనాడు సినిమా కోసం పని చేశారు.చాలా ఏళ్ల క్రితం కమల్‌ హాసన్ మరియు వెంకటేష్ లు కలిసి 2009 సంవత్సరంలో ఈనాడు సినిమా లో నటించారు.

అందులో వెంకటేష్ పోలీస్ గా నటించాడు.కమల్‌ హాసన్ ఒక సామాన్య వ్యక్తిగా కనిపించాడు.

Advertisement

చాలా ఏళ్ల తర్వాత వీరిద్దరు ఒకే స్టేజీ మీద కలవడం జరుగుతుంది.విక్రమ్‌ సినిమా తో కమల్‌ హాసన్ కు చాలా సంవత్సరాల తర్వాత ఒక సక్సెస్ దక్కబోతుంది.

ఆ సక్సెస్ ఖచ్చితంగా ఆయన్ను మరో రేంజ్ లో ముందుకు తీసుకు వెళ్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లు దక్కించుకున్న కమల్‌ సినిమా వచ్చి చాలా ఏళ్లు అవుతుంది.

ఎట్టకేలకు విక్రమ్ సినిమా ఆ రేంజ్ వసూళ్లను దక్కించుకుంటుందనే నమ్మకం ను కొందరు వ్యక్తం చేస్తున్నారు.అతి భారీ వసూళ్ల కోసం అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు.కమల్‌ హాసన్ కు తెలుగు లో కూడా భారీ ఎత్తున అభిమానులు ఉన్నారు.

ఇక విక్రమ్‌ తెలుగు వర్షన్ ను నితిన్‌ తండ్రి సుధాకర్ రెడ్డి డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నాడు.ఆయన భారీ మొత్తానికి విక్రమ్‌ తెలుగు డబ్బింగ్‌ రైట్స్ ను కొనుగోలు చేయడం జరిగింది.

వ‌ర్షాకాలంలో నైట్ ఈ విధంగా పాల‌ను తీసుకుంటే మ‌స్తు హెల్త్ బెనిఫిట్స్‌!

కమల్‌ హాసన్ కు గతంలో తెలుగు లో బాలు డబ్బింగ్‌ చెప్పే వారు.ఇప్పుడు ఆయనే డబ్బింగ్ చెప్పుకుంటాడా లేదంటే మనో చెప్తారా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement