గుడివాడలో కొడాలి నాని కి ఈసారి కూడా ఎదురు లేదా?

వైసీపీ నుంచి తెలుగు దేశం నాయకుడు చంద్రబాబు కు నిద్ర పట్టకుండా చేసే నేతల్లో కొడాలి నాని( Kodali Nani ) పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.

చంద్ర బాబు నాయుడు పై వ్యక్తిగతం గా బూతులు కూడా మాట్లాడే కొడాలి నాని చంద్రబాబు పైన , ఆయన తనయుడు లోకేష్ పైన ఒంటి కాలిపై లేస్తుంటారు.

ఆయన భాష పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయినా కూడా ఆయన పట్టించుకోరు.జగన్ కూడా కొడాలి నాని అన్ని విధాల ప్రోత్సహిస్తారని చెప్తారు .తమకు అన్ని విధాల కంట్లో నలుసుగా మారిన కొడాలి నాని ఈసారి ఎట్టి పరిస్థితులలోనూ ఓడించాలని పట్టుదలతో తెలుగుదేశం పార్టీ ఉంది.ప్రస్తుతం గుడివాడ టిడిపి ఇన్చార్జి రావి వేంకటేశ్వర రావు( Raavi Venkateswara Rao ) కు కొడాలి నాని ఓడించే సమర్థత లేదని భావిస్తున్న టిడిపి అధినాయకత్వం ప్రవాస ఆంధ్రుడు అయిన వెనిగండ్ల రాము ( Venigandla Ramu )కు మద్దత్తు ఇస్తుందని వార్తలు వస్తున్నాయి .ఆ దిశగా ఇప్పటికే హామీ పొందిన వెనిగండ్ల రాము నియోజక వర్గం లో తన పని మొదలుపెట్టేసారని వార్తలు వస్తున్నాయి .విదేశీ వ్యాపార వేత్త అయిన ఈయన ఆర్థికంగా చాలా బలవంతుడని.కొడాలి నాని ఢీకొట్టే ఆర్థిక సత్తా ఈయనకు ఉందని తెలుగుదేశం అధినాయకత్వం నమ్ముతుంది .

అంతేకాకుండా కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఈయన ఒక దళిత అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఈయనకు పిల్లనిచ్చిన మామ కృష్ణాజిల్లాలో ఒక పేరుమోసిన పాస్టర్ అట .ఆయన ఆధ్వర్యంలో కొన్ని చర్చి లు కూడా నడుస్తున్నాయి.ఆర్థికంగా బలంగా ఉండటం దళిత, క్రైస్తవ ఓటు బ్యాంకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉండడంతో ఈయన కచ్చితంగా గెలుపొందుతారనే అంచనాలతో తెలుగుదేశం పార్టీ.

ఉందని వార్తలు వస్తున్నాయి .అయితే ఇప్పటివరకు పార్టీలో సిన్సియర్గా పని చేసుకుంటూ వస్తున్న రావి వెంకటేశ్వరరావు వర్గం ఈయనకి ఏ మేరకు మద్దతు ఇస్తుందా అన్నది ప్రశ్నార్థకం.ఇప్పటికీ తనకే టికెట్ అని నమ్ముతున్న వెంకటేశ్వరరావుఈయన అభ్యర్థిత్వాన్ని ఎట్టి పరిస్థితుల లోనూ ఒప్పుకోరని చెబుతున్నారు.

Advertisement

మరోవైపు రాజకీయంగా ఎన్ని బూతులు మాట్లాడినా ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా నియోజకవర్గ ప్రజల అవసరాలు తీర్చడంలో మాత్రం కొడాలి నాని ఎప్పుడు ముందుంటారని ప్రతి కార్యకర్త ను కూడా గుర్తుపెట్టుకుని పలకరిస్తారని మిగతా నాయకుల్లాగా కేవలం మాటలతో సరిపెట్టకుండా దగ్గరుండి పనులు చేయిస్తారని అందుకే ఎంత ప్రయత్నించినా కూడా ఈయనను ఓడించడం కష్టమని గుడివాడ వైసీపీ శ్రేణులు చెప్తున్నాయి మరి ఎట్టి పరిస్థితుల్లోనూ నానిని ఓడించాలని కంకణం కట్టుకున్న తెలుగుదేశం పార్టీ( TDP )కి వర్గ పొరును తీర్చడం ప్రధాన సమస్య మారుతుందని నానిని ఓడించడం ఈసారి కూడా కష్టమే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .

స్వెటర్‌ వేసుకొని నిద్రిస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!
Advertisement

తాజా వార్తలు