దేవుడికి నైవేద్యం పెట్టే సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి రోజు దేవుడికి పూజలు చేయడం వివిధ రకాల నైవేద్యాలను సమర్పించడం చేస్తుంటాము.

ఇలా ప్రతి రోజు ఉదయాన్నే ఇంటిని శుభ్రపరచుకుని పూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది.

ఇలా పూజలు చేసే సమయంలో ప్రతి ఒక్కరు ఎంతో నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు.అయితే కొన్నిసార్లు మనకు తెలియకుండా జరిగే పొరపాట్లు వల్ల ఎంతో నష్టాన్ని భరించాల్సి వస్తుంది.

ఈ క్రమంలోనే మనం పూజ చేసే సమయంలో ఎన్నో నియమాలను పాటించాలి.ఇలా లేనిపక్షంలో మన ఇంటి పై ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడి ఎన్నో ఇబ్బందులకు గురవుతారు.

ముఖ్యంగా దేవ దేవతలకు పూజ అనంతరం మన స్థాయి కొద్దీ నైవేద్యం పెట్టడం ఆచారంగా వస్తోంది.అయితే దేవుడికి నైవేద్యం పెట్టె సమయంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

Advertisement

దేవుడికి నైవేద్యం సమర్పించేటప్పుడు చాలామంది పూజ తరువాత నైవేద్యం పెట్టి నైవేద్యాన్ని మరుసటి రోజు ఉదయం ఆవుకు తినిపించడం చేస్తుంటారు.అయితే ఇది పూర్తిగా తప్పు అని పండితులు చెబుతున్నారు.

దేవుడికి నైవేద్యంగా సమర్పించిన పదార్థాన్ని కొంత సమయం తర్వాత ఆ నైవేద్యం తీసి అందరికీ ప్రసాదంగా పంచాలి.

ఇలా దేవుడికి నైవేద్యంగా సమర్పించేటప్పుడు పాత్రల విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.ముఖ్యంగా దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు బంగారు వెండి లేదా రాగి పాత్రలో నైవేద్యం పెట్టడం ఎంతో శ్రేయస్కరం.ఇవి లేని పక్షంలో మట్టి పాత్రలో నైవేద్యం పెట్టాలి.

ముఖ్యంగా రాగిపాత్రలో దేవుడికి నైవేద్యం పెట్టడం ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు.ఇలా దేవుడికి నైవేద్యం పెట్టే సమయంలో తప్పనిసరిగా ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు తెలియజేస్తున్నారు.

శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్!
Advertisement

తాజా వార్తలు