వైసీపీకి వాసిరెడ్డి పద్మ రాజీనామా .. జగన్ పై తీవ్ర విమర్శలు

వైసీపీ సీనియర్ నేత,  జగన్( Jagan ) కు అత్యంత సన్నిహితురాలిగా పేరుపొందిన మాజీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ( Vasireddy Padma )వైసిపికి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్భంగా రాజీనామా లేఖలో అనేక అంశాలను ప్రస్తావిస్తూ, జగన్ తీరుపైన పద్మ విమర్శలు చేశారు.

పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారిని మోసం చేశారని,  ఇప్పుడు అధికారం పోయాక మరోసారి గుడ్ బుక్ పేరుతో మోసం చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని పద్మ విమర్శించారు.  వైసీపీని వ్యాపార సంస్థలా జగన్ నడిపారని,  పార్టీ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన వారిని జగన్ పట్టించుకోలేదని , ఇప్పుడు కావాల్సింది గుడ్ బుక్ కాదని , గుండె బుక్ అని వాసిరెడ్డి పద్మ సెటైర్లు వేశారు.

Vasireddy Padmas Resignation From Ycp Is Heavily Criticized On Jagan, Vasireddy

అయితే ఆమె టిడిపిలో( TDP ) చేరే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది .గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో( Praja Rajyam Party ) వాసిరెడ్డి పద్మ కీలకంగా వ్యవహరించారు.ఆ తరువాత వైసిపిలో చేరారు.

  జగన్కు అత్యంత సన్నిహితురాలిగా పేర్కొన్నారు.  వైసీపీ అధికారంలోకి రాగానే మహిళ కమిషన్ చైర్మన్ పదవిని జగన్ వాసిరెడ్డి పద్మకు ఇచ్చారు.

Advertisement
Vasireddy Padma's Resignation From YCP Is Heavily Criticized On Jagan, Vasireddy

ఎన్నికల సమయంలో జగ్గయ్యపేట టికెట్ ను పద్మ ఆశించారు.  ఆ టికెట్ ఇస్తామని ఆమెకు జగన్ హామీ ఇచ్చినా,  అది నెరవేరలేదు.

ప్రస్తుతం వైసీపీ ( YCP )ఓటమి చెందడం, తనకు పెద్దగా అ పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదన్న అసంతృప్తితో ఉన్న వాసిరెడ్డి పద్మ తాజాగా రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Vasireddy Padmas Resignation From Ycp Is Heavily Criticized On Jagan, Vasireddy

టీవీ యాంకర్ శ్యామలను వైసీపీ అధికార ప్రతినిధిగా ఎంపిక చేయడం, ఆమెను ప్రోత్సహిస్తూ తమను పక్కన పెట్టడం పై వాసిరెడ్డి పద్మ అసంతృప్తితో ఉంటున్నారు.దీంతో వైసీపీలో ఉన్నా,  తన రాజకీయ భవిష్యత్ గందరగోళంలోనే ఉంటుందని అంచనాకు వచ్చిన వాసిరెడ్డి పద్మ  వైసీపీకి రాజీనామా చేయడంతో పాటు,  జగన్ పైన తన అసంతృప్తిని వెళ్లగక్కారు.  టిడిపి లేదా జనసేనలో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు