ఆపరేషన్ వాలెంటైన్ - మట్కా.. మధ్యలో పెళ్లి.. పక్కా ప్లానింగ్ తో వరుణ్ రెడీ!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Varun Tej ) క్రేజీ లైనప్ ను సెట్ చేసుకుంటున్నారు.

ఒకవైపు గాండీవధారి అర్జున( Gandeevadhari Arjuna ) సినిమా పూర్తి కాగా ఈ సినిమాను ఇదే నెలలో ఆగస్టు 25న ప్రేక్షకుల ముందు తీసుకు రానున్నారు.

మరో వైపు మరో రెండు సినిమాలు లైన్లో పెట్టారు.ప్రెజెంట్ వరుణ్ తేజ్ నటిస్తున్న సినిమాల్లో ఆపరేషన్ వాలెంటైన్ సినిమా( Operation Valentine ) ఒకటి.

ఈ సినిమా కూడా భిన్నంగా ఉండనుంది.నిజ జీవిత సంఘటనల ఆధారంగా దేశ భక్తి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాను నూతన డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కిస్తున్నాడు.

భారత వాయుదళ నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది.తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 8న రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ ద్వారా వెల్లడించింది.

Advertisement

ఈ సినిమాలో వరుణ్ తేజ్ కు జంటగా బాలీవుడ్ బ్యూటీ మానుషీ చిల్లర్( Manushi chhillar ) హీరోయిన్ గా నటిస్తుంది.ఇక పాన్ ఇండియన్ వ్యాప్తంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సోనీ పిక్చర్స్ అండ్ రెనైస్సేన్స్ పిక్చర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఇది ఎలాంటి గ్యాప్ లేకుండా షూట్ పూర్తి చేస్తూనే ఇటీవలే మరో సినిమాను ప్రకటించాడు.

మట్కా( Matka Movie ) పేరుతొ తెరకెక్కబోతున్న ఈ సినిమా ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చింది.

ఇదే సమయంలో వరుణ్, లావణ్య పెళ్లి( Varun Lavanya Marriage ) కూడా ఉంది.మరి పెళ్లి డిసెంబర్ లో ఆపరేషన్ వాలెంటైన్ రిలీజ్ అయ్యాక ఉంటుందని టాక్.పెళ్లి తర్వాత రెండు నెలలు విరామం తీసుకుని అప్పుడు మట్కా సినిమాను స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది.

మొత్తంగా వరుణ్ తేజ్ ఒక పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నాడు.ఈ నెలలో రిలీజ్ కానున్న సినిమా ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 13 , శుక్రవారం , 2023
Advertisement

తాజా వార్తలు