Operation Valentine Review : ఆపరేషన్ వాలెంటైన్ రివ్యూ అండ్ రేటింగ్!

మెగా హీరో వరుణ్ తేజ్( Varun Tej ) డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్( Sakthi Prathap Singh ) దర్శకత్వంలో నటించినటువంటి తాజా చిత్రం ఆపరేషన్ వాలంటైన్.

( Operation Valentine ) ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఫిబ్రవరి 14 పుల్వామా దాడి ఘటనలో 40 మంది వీర జవాన్లు మరణించారు అయితే ఈ ఘటన తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్ పై దాడి జరిపిన సంఘటనలను ఆధారంగా చేసుకొని ఈ సినిమా కథను రూపొందించారు శక్తి ప్రతాప్ సింగ్.మరి నేడు విడుదలైనటువంటి ఈ సినిమా ఎలా ఉంది ఈ సినిమా కథ ఏంటి అనే విషయానికి వస్తే.

కథ:

రుద్ర(వరుణ్ తేజ్)( Rudra ) ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వింగ్ కమాండర్.20 మీటర్ రేంజ్ లో జెట్ ఫైటర్ ని తీసుకెళ్తే శత్రువుల రేడార్ సిగ్నల్స్ కి చిక్కము అనే వజ్ర కాన్సెప్ట్ మీద ప్రయోగాలు చేస్తూ ఉంటాడు.అయితే ఈ ప్రయోగంలో భాగంగా తన స్నేహితులు అయినటువంటి కబీర్(నవదీప్) ని కోల్పోతాడు.

దీంతో వజ్ర ఆపరేషన్ సస్పెండ్ చేస్తారు.ఈ ఘటనలో రుద్ర గాయపడతాడగా కొద్దిరోజులు ఎయిర్ ఫోర్స్ కి దూరంగా ఉండి తిరిగి మళ్లీ జాయిన్ అవుతారు.

సంఘటన వల్ల తన ప్రేయసి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో రాడార్ వింగ్ కమాండర్ అహనా గిల్(మానుషీ చిల్లర్)( Manushi Chhillar ) మధ్య గ్యాప్ వస్తుంది.

Advertisement

ఇక తిరిగి రుద్ర విద్యులలో జాయిన్ అయిన తర్వాత జెట్ పైలెట్ గా ఓ ఆపరేషన్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసి వస్తుంటే పుల్వామా అటాక్( Pulwama Attack ) జరుగుతుంది.ఓ ఉగ్రవాది CRPF జవాన్స్ ట్రక్స్ వద్దకు సూసైడ్ బాంబర్ గా వచ్చి పేల్చడంతో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోతారు.ఈ ఘటనకు ప్రతీకారం తీర్చుకోవడం కోసం పాకిస్థాన్ లోకి చొరబడి మన పైలెట్స్ బాలాకోట్ దాడిని చేస్తారు.

ఆ ఆపరేషన్ ని రుద్ర లీడ్ చేస్తాడు, కింద నుంచి అహనా రాడార్ కంట్రోల్ చేస్తుంది.ఈ ఆపరేషన్ లో ఇండియన్ టీం ఎలా సక్సెస్ అయ్యారు? అక్కడ ఉగ్రవాదులను ఎలా అంతం చేశారు అనే విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల నటన:

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ రుద్రగా వరుణ్ తేజ్ అదరగొట్టాడని చెప్పొచ్చు.ఈయన యాక్షన్స్ సన్ని వేశాలలోనూ అలాగే పైలెట్ గా కూడా అద్భుతమైన నటనని కనబరిచారు.ఇక మానుషీ చిల్లర్ కింద ఉండి రాడార్ సిగ్నల్స్ చూస్తూ పైలెట్స్ కి ఆదేశాలు జారీ చేసే ఆఫీసర్ గా బాగా నటించింది.

ఇక వీరిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు కూడా అద్భుతంగా అనిపించాయి.ఇక నవదీప్( Navadeep ) అలీ రెజా( Ali Reza ) వంటి వారందరూ కూడా వారి పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.

ఆక‌లిగా లేదని భోజ‌నం మానేస్తున్నారా.. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఖాయం..!
'హెలికాప్టర్ ' కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ? 

టెక్నికల్:

ఈ సినిమా VFX గురించి చెప్పుకోవాలి.ఈ సినిమాని చాలా వరకు గ్రీన్ మ్యాట్ లోనే షూట్ చేశారు.గాలిలో జెట్ ఫైటర్ సీన్స్ అన్ని VFX తో అద్భుతంగా చూపించారు.

Advertisement

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఇచ్చారు.గాలిలో జెట్ ఫైటర్స్ తిరుగుతున్న శబ్దాలని కూడా చాలా రియల్టీగా వినిపించారు.

పాటలు పరవాలేదు అనిపించాయి.దర్శకుడిగా శక్తి ప్రతాప్ సింగ్ మొదటి సినిమాతోనే ఇలాంటి సబ్జెక్టుని తీసుకొని దాన్ని చక్కగా చూపించి సక్సెస్ అయ్యాడు.

విశ్లేషణ:

ఈ సినిమా కథ ఏంటి అనేది మన అందరికీ తెలిసిందే.పుల్వామా అటాక్, దానికి కౌంటర్ అటాక్ ఆధారంగా తీసిన సినిమా అయినప్పటికీ వాటిని ఎలా చూపించారు అనేదే ముఖ్యం.ఫస్ట్ హాఫ్ రుద్ర క్యారెక్టర్, అతను చేసిన ప్రయోగం, రుద్ర – అహనా మధ్య ప్రేమని చూపించారు.

ఇంటర్వెల్ ముందు పుల్వామా అటాక్ దాడిని చూపించి సెకండ్ హాఫ్ లో ఎలా కౌంటర్ ఇస్తారు అని అందరూ వెయిట్ చేసేవిధంగా స్క్రీన్ ప్లే అద్భుతంగా చూపించారు.ఇక సెకండ్ హాఫ్ లో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్, మన పైలెట్స్ ఎలా పాకిస్థాన్ లోకి ఎంటర్ అయి ఉగ్రవాదులని అందం చేసే అక్కడి నుంచి ఎలా తప్పించుకున్నారు అని విషయాలన్నీ కూడా చాలా ఆసక్తికరంగానే ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:

వరుణ్ నటన, విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ సోర్స్.

మైనస్ పాయింట్స్:

పాటలు, అక్కడక్కడ కొంచెం బోర్ కొట్టే సన్నివేశాలు.

బాటమ్:

ఈ సినిమా కథ మన అందరికీ తెలిసిందే అయినప్పటికీ తెరపై మాత్రం ఈ సినిమాని చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి కనుపరుస్తారు.

రేటింగ్: 2.5/5

తాజా వార్తలు