'గని' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది..ఇన్స్పైర్ చేస్తున్న సాంగ్!

ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గని సినిమాలో నటిస్తున్నాడు.కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది.

ఇందులో వరుణ్ తేజ్ జోడీగా సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది.స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధూ ముద్ద నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.ఇక కరోనా తగ్గి థియేటర్స్ మళ్లీ మునుపటిలాగా తెరుచు కోవడంతో ఈ సినిమాను డిసెంబర్ 3న రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

ఇక రిలీజ్ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్.ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి ఈ రోజు ఫస్ట్ సింగిల్ విడుదల చేసారు.

Advertisement
Varun Tej Gani Movie First Single Out Now Details, Varun Tej, Gani, First Single

గని ఆంథెమ్ పేరుతొ ఈ సాంగ్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.నీ జగజగడం.

వదలకురా కడవరకు.ఈ కథన గుణం.

అవసరమే ప్రతి కలకు అంటూ సాగుతున్న ఈ పాట క్రీడాకారులను ఇన్స్పైర్ చేస్తుంది.

Varun Tej Gani Movie First Single Out Now Details, Varun Tej, Gani, First Single

రామజోగయ్య శాస్త్రి అందించిన ఈ లిరిక్స్ కు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మరొకసారి మాస్ బీట్స్ కలిపి ఇరగ దీసాడు.ఈ సాంగ్ ఆద్యంతం ఎనర్జిటిక్ గా సాగుతూ ప్రేక్షకులను అలరిస్తుంది.ఈ సినిమా కోసం వరుణ్ చాలా కష్టపడ్డాడు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

బాక్సర్ అవ్వడం కోసం కోచ్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం వంటివి ఈ పాటలో చూపించారు.ఈ సినిమాలో బాక్సింగ్ కోచ్ గా బాలీవుడ్ స్టార్ నటుడు సునీల్ శెట్టి కనిపిస్తున్నాడు.

Varun Tej Gani Movie First Single Out Now Details, Varun Tej, Gani, First Single
Advertisement

ఈ సాంగ్ చుసిన ప్రేక్షకులు పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమాను గుర్తుకు తెచ్చుకుంటున్నారు.మరి ఈ సినిమా వరుణ్ తేజ్ కెరీర్ కు ప్లస్ అవుతుందో లేదో చూడాలి.ఇక వరుణ్ ఈ సినిమాతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్ ఎఫ్ 3 సినిమాలో కూడా నటిస్తున్నాడు.

ఈ సినిమా కూడా ప్రెసెంట్ షూటింగ్ జరుపుకుంటుంది.

తాజా వార్తలు