బాలయ్యకు ఈ ' తుపాకీ ' బెదిరింపులు ఏంటి ?

సినిమా ఇండస్ట్రీ మొత్తం తనను పక్కన పెడుతున్నారు అన్న బాధతోనో, ఆవేశంతోనే నిన్న నందమూరి బాలకృష్ణ చిరంజీవి బృందాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే.

ఈ పోరు లో బాలయ్య మీద మెగా కాంపౌండ్ హీరోలంతా విమర్శనాస్త్రాలు వదులుతున్నారు.

నువ్వు ఏమైనా చక్రవర్తివా ? ఒక సాధారణ హీరోవి మాత్రమే అంటూ మెగా బ్రదర్ నాగబాబు ఘాటుగా కౌంటర్ ఇవ్వగా, ఇప్పుడు మరో మెగా హీరో వరుణ్ తేజ్ ట్విట్టర్ వేదికగా చేసిన విమర్శలు ఇప్పుడు మరింత వైరల్ అవుతున్నాయి.తుపాకీ పట్టుకున్న వారితో ఏమి మాట్లాడగలం అంటూ వరుణ్ తేజ్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

అంటే పరోక్షంగా బాలయ్య తుపాకీ కేసును గురించి వరుణ్ తేజ్ ప్రస్తావించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.వరుణ్ తేజ్ ట్వీట్ పై అటు బాలయ్య కానీ, ఆయన వర్గం గాని స్పందించకపోవడం చూస్తుంటే వారు డైలమాలో పడినట్లు తెలుస్తోంది.2004 జూన్ 3వ తేదీన నిర్మాతలు బెల్లంకొండ సురేష్, సత్యనారాయణ చౌదరి బాలకృష్ణ నివాసంలో జరిగిన కాల్పుల్లో గాయపడ్డారు.ఇది అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది.

ఆ సమయంలో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉండగా, టిడిపి ప్రతిపక్షంలో ఉంది.అయినా చంద్రబాబు పురంధరేశ్వరి విజ్ఞప్తి మేరకు అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ఈ కేసును రాజకీయ అవసరాలకు వాడుకోకుండా, బాలయ్యను తప్పించారనే వార్తలు వచ్చాయి.

Advertisement
Varun Tej Twitter Post On Balakrishna ,Mega Family, Balakrishna, Varun Tej, Naga

ముఖ్యంగా ఈ కేసులో బాలయ్య మానసిక పరిస్థితి సరిగా లేదని వైద్యులు సర్టిఫికెట్ ఇవ్వడంతో ఈ కేసు కాస్త క్లోజ్ అయింది.

Varun Tej Twitter Post On Balakrishna ,mega Family, Balakrishna, Varun Tej, Naga

దీనిపై అప్పటి వైఎస్ ప్రభుత్వంపై కోర్టుకి కూడా వెళ్ళకుండా సైలెంట్ అయిపోవడంతో ఈ కేసు నుంచి బాలయ్య బయటపడ్డారు.ఇక ఈ వ్యవహారం అంతా సర్దుమణిగిపోయింది అనుకుంటుండగా ఇప్పుడు ఆ కేసును ప్రస్తావిస్తూ మెగా ఫ్యామిలీ బాలయ్య ని టార్గెట్ చేసుకుని, ఆయన మళ్లీ నోరెత్తకుండా చేయాలనే వ్యూహంతో ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తోంది.ఈ కరోనా కష్టకాలంలో సినిమా ఇండస్ట్రీ అంతా ఏకతాటిపైకి వచ్చి సినీ కార్మికులు పడుతున్న ఆకలి బాధలను తీర్చే విధంగా ముందుకు వెళ్ళకుండా, ఇలా ఆధిపత్యపోరుతో టాలీవుడ్ పరువును బజారున పడేస్తుండడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

Varun Tej Twitter Post On Balakrishna ,mega Family, Balakrishna, Varun Tej, Naga

టాలీవుడ్ లో ఈ మధ్య ఆధిపత్యపోరు బాగా పెరిగిపోయింది.ఇప్పటికే రెండు మూడు గ్రూపులు ఇండ్రస్ట్రీపై పెత్తనం చేయాలని చూస్తున్నాయి.ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి కేసీఆర్ , జగన్ రెండు ప్రబుత్వాలతోనూ సఖ్యత గా ఉంటూ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

ఏడాది ముందుకు వరకు నందమూరి బాలకృష్ణ ఇదే రేంజ్ లో చక్రం తిప్పాడు.కానీ ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో పాటు, తాను మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న మెగా బ్రదర్స్ ఇప్పుడు పెత్తనం చేస్తుండడం బాలయ్యకు నచ్చడం లేదు.

న్యూస్ రౌండప్ టాప్ 20

ఇప్పుడు ఈ మెగా హీరోలు బయటకు తీసిన తుపాకీ అస్త్రం పై బాలయ్య ఏ విధంగా స్పందిస్తాడ చూడాలి.

Advertisement

తాజా వార్తలు