క్లారిటీ ఇచ్చేసారు: టీడీపీ ఎన్టీఆర్ అవసరమే లేదు !

తెలుగుదేశం పార్టీ మీద ఒక్కో నాయకుడు తమ అసంతృప్తిని బయట పెడుతూ, పార్టీ మీద, పార్టీ నాయకుల మీద తీవ్ర విమర్శలు చేస్తూ బయటకు వెళ్లిపోతున్నారు.

ప్రస్తుతానికి కృష్ణ జిల్లా నేతలు దేవినేని అవినాష్, వల్లభనేని వంశీ ఈ బాట పట్టగా మరికొంతమంది ఎమ్మెల్యేలు వేచి చూసే దివరణిలో ఉన్నారు.

మరికొందరు మాత్రం కేంద్ర అధికార పార్టీ బీజేపీలోకి వెళ్లేందుకు అన్నిరకాల ఏర్పాట్లు చేసుకున్నారు.ఈ మధ్య జరిగిన ఇసుక దీక్షకు, టీడీపీ అత్యవసర సమావేశానికి కొంతమంది శాసనసభ్యులు డుమ్మా కొట్టడం టీడీపీ పరిస్థితిని తెలియజేస్తున్నాయి.

ఈ క్రమంలో బయటకు వెళ్లి పోతున్న నేతలంతా ప్రధానంగా చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ మీద ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు.దీనికి పార్టీ నాయకులూ, లోకేష్ వంటివారు స్పందిస్తున్నా చంద్రబాబు మాత్రం మీడియా ముఖంగా ఎక్కడా బయటకు రావడం లేదు.

Varla Ramaiah Says Tdp Dont Want Jr Ntr For The Party

అసలు తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం అలజడి రేగుతున్నా బాబు ఎందుకు తన స్పందన తెలియజేయడం లేదు.వయసు రీత్యా చూసుకున్నా చంద్రబాబు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది అనే వ్యాఖ్యలు తీవ్రమవుతున్నాయి.ఈ నేపథ్యంలో పార్టీని సమర్థవంతంగా నడిపించగల నాయకులు ఎవరా అనే ప్రశ్న తలెత్తుతోంది.

Advertisement
Varla Ramaiah Says Tdp Dont Want Jr Ntr For The Party-క్లారిటీ

చంద్రబాబు రాజకీయ వారసుడిగా లోకేష్ బాబు ఉన్నా ఆయన మీద పార్టీలో ఎవరికి నమ్మకం లేదు.ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ కొద్ది రోజులుగా తెరపైకి వస్తోంది.తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఎదుర్కుంటున్న ఒడిదుడుకుల నుంచి బయట పడేయాలంటే ఆయన ఒక్కడే సమర్ధుడు అందరూ బలంగా నమ్ముతున్నారు.2009 ఎన్నికల ప్రచారంలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన ప్రసంగాలు టిడిపికి అప్పట్లో జవసత్వాలు తీసుకొచ్చారని కానీ లోకేష్ కోసం చంద్రబాబు ఆయనను వాడుకుని వదిలేశారని కోడలి నాని, వల్లభనేని వంశీ వంటి వారు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.

Varla Ramaiah Says Tdp Dont Want Jr Ntr For The Party

ప్రస్తుతం ఎన్టీఆర్ రాక కోసం అందరూ ఎదురుచూస్తూ చర్చించుకుంటున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ అవసరం టీడీపీకి లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వర్ల రామయ్య.ప్రస్తుతం నాయకుల జంపింగ్ వ్యవహారం, జగన్ ప్రభుత్వం పై విరుచుకుపడుతూ, పార్టీ తరఫున వాయిస్ వినిపిస్తున్న వర్ల రామయ్య ఈ విధంగా వ్యాఖ్యానించడం చేస్తున్నారు.ఈ క్రమంలో ఎన్టీఆర్ ప్రస్తావన ఎక్కువ అవుతున్న నేపథ్యంలో చంద్రబాబు తన మాటను ఇలా వర్ల నోటి నుంచి పలికించారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మాకు జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదు, మా నాయకుడు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ అంటూ వర్ల రామయ్య ఘాటుగా చెప్పారు.ప్రస్తుతం ఈ వాఖ్యలపై జోరుగా చర్చ జరుగుతోంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు