డేట్ మార్చుకున్న ''వారిసు''.. కారణం అదేనా?

కోలీవుడ్ స్టార్ హీరోల్లో విజయ్ దళపతి ఒకరు.ఈయన ప్రెజెంట్ కోలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతూ ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతున్నాడు.

ఈయన గత సినిమా బీస్ట్ ప్లాప్ టాక్ తెచ్చుకున్న వసూళ్లు మాత్రం బాగా వచ్చాయి.ఇక ఈసారి అయిన సూపర్ హిట్ అందుకోవాలని విజయ్ కష్టపడుతున్నాడు.

ప్రెజెంట్ విజయ్ తెలుగు డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు.టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

విజయ్ దళపతి నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు వారసుడు అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు.తమిళ్ లో వారిసు అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ క్రేజీ సినిమా దిల్ రాజు భారీ స్థాయిలో శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నాడు.

Advertisement
Varisu Audio Launch Date Changed , Varisu Audio Launch, Rashmika Mandanna, Vamsi

ఈ సినిమా షూట్ ఆల్ మోస్ట్ పూర్తి కాగా ఇక ప్రొమోషన్స్ లో స్పీడ్ పెంచనున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని ఒక వార్త గత కొన్ని రోజులుగా వైరల్ అవుతూనే ఉంది.

అది కూడా ఆడియో ఫంక్షన్ అని తెలుస్తుంది.ఈ ఈవెంట్ ఎప్పుడు జరగబోతుందా అనే దానిపై వార్తలు వస్తూనే ఉన్నాయి.

ముందుగా ఈ ఈవెంట్ డిసెంబర్ 24న చేయబోతున్నట్టుగా రూమర్స్ వినిపించాయి.

Varisu Audio Launch Date Changed , Varisu Audio Launch, Rashmika Mandanna, Vamsi

కానీ ఇప్పుడు ఈ టీమ్ డేట్ మార్చుకున్నట్టు తెలుస్తుంది.డిసెంబర్ 24 నుండి మార్చుకుని 28 లేదా 29న పెట్టనున్నారు అని కోలీవుడ్ మీడియా చెబుతుంది.తమిళనాడులో జరగనున్న ఈ ఈవెంట్ ఎంత గ్రాండ్ గా జరుగుతుందో చూడాలి.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

ఇదిలా ఉండగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.తెలుగులో చిరంజీవి, బాలయ్య వంటి స్టార్ హీరోలతో పోటీ పడబోతున్న ఈ సినిమా సంక్రాంతికి ఏ మేర హిట్ అందుకుంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు