ఉత్కంఠ భరితంగా దారి సినిమా ట్రైలర్.. ఎలా ఉందంటే?

ప్రస్తుత కాలంలో ప్రేక్షకులు స్టార్ సెలబ్రెటీలు నటించిన సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలను ఇష్టపడటం లేదు.

కంటెంట్ ఉంటే చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా సినిమాలకు మంచి విజయం అందిస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎన్నో చిన్న సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాలు ఉన్నాయి.ఇకపోతే ఇలాంటి అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం దారి.

ఈ సినిమాకి యు సురేష్ బాబు దర్శకుడిగా వ్యవహరించగా ఈ చిత్రాన్ని ఫిఫ్త్ హౌస్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు.చిత్రంలో సునీత సద్గురు, సాయి తేజ గోనుగుంట్ల, పరమేశ్వర్ హివ్రాలే, కళ్యాణ్ విట్టపు, అభిరామ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

ఇక ఇదివరకే దారి సినిమా నుంచి కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేయగా ఈ పోస్టర్ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయగా ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది.

Advertisement

ఇక ఈ ట్రైలర్ లో ప్రతి జీవికి ఏదో ఒక సమస్య ఉంటుంది.అలాగే ఈ కథలో కూడా సమస్యలకు కొలతలు లేవు కానీ రూపం ఉంది సమస్యను పట్టుకోవాలని, తీర్చాలని, ఆ సమస్యను వెతుక్కుంటూ.ఆ సమస్యను తికమక్క పెట్టెలా కదులుతుంటారు.

అయితే అందరి సమస్య ఒకటే ఈ సమస్య నుంచి దాక్కోవడం, పారిపోవడం.ఒకటి మాత్రం గుర్తు పెట్టుకుందాం మన సమస్యను పరిష్కరించడానికి ఎవరు రారు.

ఆఖరికి దేవుడు కూడా రారు అని చెప్పే డైలాగ్ అందరిని ఆకట్టుకుంటుంది.ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ వైరల్ అవుతుంది.

High Roller Tipps & Casino
Advertisement