ఈ హోమ్ మేడ్ ఫేస్ టోనర్ ను వాడితే మొటిమలు అన్నమాట అనరు!

టీనేజ్ స్టార్ట్ అయ్యిందంటే చాలు మొటిమలు వేధించడం ప్రారంభిస్తాయి.ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి అందాన్ని చెడగొడతాయి.

మనశ్శాంతిని దూరం చేస్తాయి.ఒక్కోసారి తీవ్రమైన నొప్పిని సైతం కలిగిస్తాయి.

వాటి నుంచి విముక్తి పొందడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.తోచిన చిట్కాలు పాటిస్తుంటారు.

అయితే ఇకపై టెన్షన్ వద్దు.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే హోమ్‌ మేడ్ ఫేస్ టోనర్ ను ప్రతిరోజు క‌నుక వాడితే మొటిమలు అన్న మాటే అనరు.

Advertisement

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫేస్ టోనర్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక నిమ్మ పండును తీసుకొని ఉప్పు నీటిలో శుభ్రంగా కడగాలి.

ఆ తర్వాత ఈ నిమ్మ‌ పండుకు ఉన్న తొక్కను సపరేట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్‌ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆరెంజ్ పీల్ పౌడర్ ను వేసుకోవాలి.

అలాగే కట్‌ చేసి పెట్టుకున్న‌ నిమ్మ పండు తొక్కలు వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి నైట్ అంతా వదిలేయాలి.

మరుసటి రోజు నానబెట్టుకున్న ఆరెంజ్ పౌడర్ మరియు నిమ్మ పండు తొక్కల‌ను వాటర్ తో సహా మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో నాలుగు చుక్కలు టి ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ ను వేసి బాగా క‌లిపితే మన టోనర్ సిద్ధమవుతుంది.

శ్రీ కృష్ణ పరమాత్ముడికి ఎంత మంది సంతానమో తెలుసా?

ఈ టోనర్ ను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

Advertisement

ఉదయం స్నానం చేయడానికి గంట ముందు మరియు నైట్ నిద్రించడానికి ముందు ఈ టోనర్ ను ముఖానికి అప్లై చేసుకోవాలి.ఈ టోనర్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.రోజుకు రెండు సార్లు కనుక ఈ హోమ్ మేడ్ ఫేప్ టోన‌ర్ ను వాడితే మొటిమలు చాలా త్వరగా తగ్గుముఖం పడతాయి.

మళ్లీ మళ్లీ అవి వేధించకుండా ఉంటాయి.అలాగే ఈ ఫేస్ టోనర్ ను వాడటం వల్ల ఓపెన్ పోర్స్‌ క్లోజ్ అవుతాయి.చర్మం స్మూత్ గా మారుతుంది.

స్కిన్ టోన్ సైతం మెరుగు పడుతుంది.కాబట్టి తప్పకుండా ఈ హోమ్ మేడ్ ఫేస్ టోన‌ర్ ను వాడేందుకు ప్రయత్నించండి.

తాజా వార్తలు