చర్మ సమస్యలకు ఈ మట్టితో చెక్ పెట్టండి..!

అందంగా కనిపించాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది.కానీ ఎలాంటి నియమాలు పాటించాలి? ఏం చేస్తే అందంగా ఉంటారు అనేది ఎంతోమందికి తెలియదు.

ఇక క్రీమ్స్, ఫౌండేషన్స్ లు కాకుండా ఇంట్లోనే సహజసిద్ధంగా అందంగా తయారవ్వండి.

దానికి ప్రత్యేకంగా ఏది అక్కర్లేదు.ముల్తానీ మట్టి ఉంటే చాలు అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టచ్చు.అది ఎలా అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం.

అమ్మాయిల మేకప్ బాక్స్ లలో ముల్తాన్ మట్టి కూడా ఒకటి.ఇది సహజ సిద్ధమైన కాంతిని అందిస్తూ అందాన్ని మరింత పెంచుతుంది.

ముల్తాన్ మట్టితో ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల మొహం మీద ఉండే నిర్జీవ కణాలు తొలగిపోయి, చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.వీటిలో వివిధ రకాల ప్రొడక్ట్స్ మార్కెట్లో మనకు లభిస్తాయి.

Advertisement

కానీ హెర్బల్ ముల్తాని మట్టిని వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగవు.

చర్మంలోని నూనె, దూళి, చెమట మలినాలను సమర్థవంతంగా గ్రహించి, మన చర్మాన్ని మృదువుగా ఇంకా శుభ్రంగా ఉంచుతుంది.ముల్తాని మట్టితో చర్మ సౌందర్యం కాకుండా ఆరోగ్య సమస్యల నుంచి కూడా కాపాడుతుంది.వడదెబ్బ, చర్మం దద్దుర్లు వంటి అంటు వ్యాధుల చికిత్సలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

చర్మపు మంట మరియు పురుగుల కాటుకు చికిత్స చేయడానికి కోల్డ్ కంప్రెషర్ లలో ఈ మట్టిని వాడుతారు.ముల్తాని మట్టిని వాడటం వల్ల బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, మొటిమల మచ్చలను దూరం ఉంచడంలో సహాయపడుతుందిరక్త ప్రసరణను సులభతరం చేసి ప్రకాశవంతమైన మెరుస్తున్న చర్మాన్ని మీ సొంతం చేస్తుంది.

.

Mehar Ramesh : మెహర్ రమేష్ నటుడిగా మహేష్ సినిమాలో నటించాడు అని మీకు తెలుసా ?
Advertisement

తాజా వార్తలు