గూగుల్ మీట్‌లో అదిరిపోయే ఫీచర్.. ఇక నుంచి ఆ సమస్యకు చెక్

కరోనా ప్రభావంతో ఆఫీసులు మూతపడటం, అన్నీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేయడంతో టెక్నాలజీ వినియోగం కూడా పెరిగిపోయింది.

ఆఫీసుల్లో జరిగే టీమ్ మీటింగ్‌లు( Team Meetings ) ఆన్‌లైన్‌లో నిర్వహించారు.

దీంతో జూమ్ లాంటి వీడియో కాలింగ్ యాప్‌లు అనేక వచ్చాయి.జూమ్ ఫ్లాట్‌ఫామ్ బాగా పాపులర్ అయింది.

దీని ద్వారా ఆఫీసుల మీటింగ్ లు సులువుగా నిర్వహించుకునే అవకాశం వచ్చింది.ఎంతమందైనా సరే సింపుల్ గా జూమ్( Zoom ) ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనవచ్చు.

అయితే జూమ్ గా పోటీగా ప్రముఖ టెక్నాలజీ సంస్థ గూగుల్ ఒక వీడియో కాన్పరెన్స్ ఫ్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చింది.అదే గూగుల్ మీట్.( Google Meet ) దీని ద్వారా ఎంతమందైనా సరే వీడియో కాన్పరెన్స్‌లో మాట్లాడుకోవచ్చు.

Advertisement

చాలా కంపెనీలు గూగుల్ మీట్ ను కూడా వీడియో కాన్పరెన్స్‌ల కోసం ఉపయోగిస్తున్నాయి.అయితే గూగుల్ మీట్‌లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు తీసుకొస్తున్నారు.ఫీచర్లను అప్డేట్ చేస్తూ వస్తోన్నారు.

అందులో భాగంగా తాజాగా మరో ఫీచర్‌ను అప్డేట్ చేశారు.

పిక్చర్ ఇన్ పిక్చర్ ఫీచర్‌ను గూగుల్ మీట్‌లో తీసుకొచ్చారు.ఈ ఫీచర్ ద్వారా ఫోన్ లో వేరే పని ఏదైనా చేయాలనుకున్నప్పుడు గూగుల్ మీట్ ను మినిమైజ్ చేసుకోవచ్చు.దీని వల్ల గూగుల్ మీట్ లో మీటింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఫోన్ లో వేరే పనులు చేసుకోవచ్చు.మల్టీ టాస్కింగ్‌కు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

గూగుల్ మీట్ లో మీటింగ్ జరుగుతున్న సమయంలో స్క్రీన్ దిగువున ఉన్న ఎంపికల బటన్ పై క్లిక్ చేసి ఓపెన్ పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ ను సెలక్ట్ చేసుకోవాలి.ఆ తర్వాత గూగుల్ మీట్ కుడివైపుకు మినిమైజ్ అవుతుంది.

రజనీకాంత్ తెలుగు సినిమాల్లో నటించకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు

ఆ తర్వాత మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి మార్చుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు