ఫోన్ మెమోరి ప్రాబ్లమ్స్ కి ఇవిగో చిట్కాలు

మనం మామూలుగా వాడే మొబైల్ ఫోన్స్ స్టోరేజి 16GB లేదా 32GB, కొంచెం పాత ఫోన్ వాడితే 8GB ఇన్బిల్ట్ స్టోరేజ్ వాడుతుంటారు.

మనం గమనించం కాని యాప్స్ పెరిగిన కొద్దీ, మిడియా ఫైల్స్ పెరిగినా కొద్ది స్టోరేజ్ అలా అలా పెరిగిపోయి, ఒక్కోసారి మనం ఏదైనా కొత్త యాప్ ఇన్స్టాల్ చేయాలనుకున్నా కుదరదు.

తగినంత స్పేస్ లేదని నిర్దాక్షిణ్యంగా చెప్పేస్తుంది మొబైల్.ఇలాంటప్పుడు ఏం చేయాలంటే .* చాలావరకు మొబైల్ ఫోన్స్ ప్రీ ఇంస్టాల్డ్ యాప్స్ తో వస్తాయి.అంటే మనం ఫోన్ కొన్నప్పుడు కొన్ని యాప్స్ ఫోన్లో మనకి అవసరమున్న లేకున్నా, ఆల్రెడి ఇంస్టల్ చేసి ఉంటాయన్నమాట.

ఇవి మెమోరిని మింగేస్తాయి.అలాంటప్పుడు మొబైల్ ని రూట్ చేయడం బెటర్ అప్షన్.

దాంతో మీకు అవసరం లేని ప్రీ ఇంస్టాల్డ్ యాప్స్ నుంచి విముక్తి పొందవచ్చు.* ఫేస్ బుక్ వాడటం మంచిదే కాని, ఫేస్ బుక్ మొబైల్ యాప్ మాత్రం చాలా దారుణం.

Advertisement

కనీసం వంద MB స్పేస్ తీసుకునే యాప్, బ్యాటరీని కూడా మింగేస్తుంది.కాబట్టి బ్రౌజర్ లో ఫేస్ బుక్ వాడేందుకు ప్రయత్నించండి.

లేదంటే ఫేస్ బుక్ లైట్ వెర్షన్ ని వాడండి.* మొబైల్ యాప్స్ అన్నిటినీ ఇన్బిల్ట్ స్టోరేజ్ లోనే ఉంచకుండా, కొన్నిటిని మెమోరి కార్డులో ఇంస్టాల్ చేసుకోండి.

దీంతో మొబైల్ స్టోరేజ్ మీద ఒత్తిడి తగ్గుతుంది.* మనం పెద్దగా ఆలోచించకుండా ఫోటోల మీద ఫోటోలు దిగుతుంటాం.

అవి ఎంత మెమోరిని లాగేస్తున్నాయో సరిగా గమనించం.ఏదైనా క్లౌడ్ స్టోరేజి (గూగుల్ ఫోటోస్) లాంటి యాప్ వాడండి.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

మీ ఫోటోలని అక్కడ సేవ్ చేసుకోని మేమోరిని కాపాడుకోండి.* ఎప్పటికప్పుడు వాట్సాప్, ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ నుంచి వచ్చిన మీడియా ఫైల్స్ ని డిలీట్ చేస్తూ ఉండండి.

Advertisement

ఇవి చిన్నగా కనిపించినా, పెరుగుతూ స్పేస్ ని ఆక్రమించేస్తాయి.

తాజా వార్తలు