రోజు నైట్ ఈ మిరాకిల్ క్రీమ్ ను వాడితే కళ్ళ చుట్టూ నల్లటి వల‌యాలు పరార్!

ముఖం మొత్తం తెల్లగా మృదువుగా ఉన్న కూడా కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్( Dark circles ) ఏర్పడి కొందరు కాంతిహీనంగా కనిపిస్తూ ఉంటారు.

డార్క్ సర్కిల్స్ ఏర్పడడానికి అనేక కారణాలు ఉన్నాయి.

అలాగే వాటిని దూరం చేసుకోవడానికి కూడా ఎన్నో మార్గాలు ఉన్నాయి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే మిరాకిల్ క్రీమ్ ను రెగ్యులర్ గా వాడితే డార్క్ సర్కిల్స్ కు శాశ్వతంగా గుడ్ బై చెప్పవచ్చు.

మరి ఇంతకీ ఆ మిరాకిల్ క్రీమ్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు కీర దోసకాయ స్లైసెస్, రెండు టమాటో స్లైసెస్,( Tomato slices ) నాలుగు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్( Rose water ) వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe vera gel ), హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్( Vitamin E oil ) ను వేసి బాగా మిక్స్ చేసుకుంటే మన క్రీమ్ అనేది రెడీ అవుతుంది.

Use This Miracle Cream To Get Rid Of Dark Circles Around The Eyes Dark Circles,
Advertisement
Use This Miracle Cream To Get Rid Of Dark Circles Around The Eyes! Dark Circles,

ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.ఆపై తయారు చేసుకున్న క్రీమ్ ను కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని సున్నితంగా ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.

ఉదయాన్నే గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి.

Use This Miracle Cream To Get Rid Of Dark Circles Around The Eyes Dark Circles,

ఈ విధంగా ప్రతిరోజు కనుక చేస్తే డార్క్ సర్కిల్స్ చాలా తొందరగా పరార్ అవుతాయి.కళ్ళ చుట్టూ నల్లగా మారిన చర్మం తెల్లగా మృదువుగా మారుతుంది.కళ్ళ వద్ద ఏమైనా ముడతలు ఉన్నా తగ్గుముఖం పడతాయి.

కాబట్టి డార్క్ సర్కిల్స్‌ తో సతమతం అవుతున్నవారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న క్రీమ్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!
Advertisement

తాజా వార్తలు