ఈ హోమ్ మేడ్ హెయిర్ సీరంను వాడితే జుట్టు నెల రోజుల్లో ఒత్తుగా మారుతుంది!

మీ జుట్టు విపరీతంగా రాలిపోతోందా.? దాని కారణంగా ఒత్తుగా ఉండాల్సిన మీ కురులు పల్చగా మారాయా.

? ఖరీదైన షాంపూ, ఆయిల్ వాడుతున్న ఎలాంటి ఫలితం లభించడం లేదా.? అయితే చింతించకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ హెయిర్ సీరం మీకు చాలా అద్భుతంగా సహాయపడుతుంది.

ఈ హెయిర్ సీరంను కనుక వాడితే జుట్టు రాలడం తగ్గుముఖం పడుతుంది.అదే సమయంలో మీ కురులు నెల రోజుల్లో ఒత్తుగా పెరగడం ప్రారంభమవుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెయిర్ సీరం( Hair serum )ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు బియ్యం( rice ) వేసి ఒక కప్పు వాటర్ పోసి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత ఒక ఉల్లిపాయ( onion ) తీసుకుని తొక్క తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మరియు నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి.చివరిగా ఒక కప్పు వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Use This Homemade Hair Serum To Make Your Hair Thicker , Homemade Hair Serum, Ha
Advertisement
Use This Homemade Hair Serum To Make Your Hair Thicker , Homemade Hair Serum, Ha

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, ( aloe vera gel )హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుని అన్ని కలిసేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి.అంతే మన హెయిర్ సీరం సిద్ధం అయినట్టే.

Use This Homemade Hair Serum To Make Your Hair Thicker , Homemade Hair Serum, Ha

ఈ సీరం ను నైట్ నిద్రించే ముందు స్కాల్ప్ కు ఒకటికి రెండు సార్లు అప్లై చేసి వేళ్ళతో సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.మరుసటి రోజు మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ హోమ్ మేడ్ హెయిర్ సీరంను వాడితే జుట్టు రాలడం క్రమంగా కంట్రోల్ అవుతుంది.

అదే సమయంలో కురులు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతాయి.మరియు ఈ సీరం చుండ్రును సైతం తరిమి కొడుతుంది.

అఖండ 2 పై ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు... ఒక్క మాటతో అంచనాలు పెంచారుగా!
Advertisement

తాజా వార్తలు