ఈ హోం మేడ్ టూత్ పౌడర్ ను వాడితే దంతాలు స్ట్రాంగ్ గా మరియు తెల్ల‌గా మార‌తాయి!

తమ దంతాలు ముత్యాల మాదిరి తెల్లగా, అందంగా మెరిసి పోవాలని అందరూ కోరుకుంటారు.

కానీ, ఆహారపు అలవాట్లు, పోషకల కొరత, దంత సంరక్షణ లేకపోవడం, ధూమపానం తదితర కారణాల వల్ల దంతాలు పసుపు రంగులోకి మారడమే కాదు బలహీనంగా కూడా తయారవుతుంటాయి.

దాంతో దంతాలను తెల్లగా మరియు స్ట్రాంగ్ గా మార్చుకునేందుకు ఖరీదైన టూత్ పేస్ట్ ల‌ను వాడుతుంటారు.అయితే వాటి వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో తెలియదు కానీ.

ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ టూత్ పౌడర్ ను వాడితే కనుక మీ దంతాలు ముత్యాల్లా మెరవడమే కాదు సూపర్ స్ట్రాంగ్ గా సైతం మారతాయి.మరి ఇంతకీ ఆ టూత్ పౌడర్‌ను ఎలా తయారు చేసుకోవాలి.? అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు లవంగాలను వేసి మెత్తటి పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి.

అలాగే అదే మిక్సీ జార్ లో ఒక కప్పు రాక్ సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు పసుపు, నాలుగు టేబుల్ స్పూన్లు గ్రైండ్ చేసి పెట్టుకున్న సాల్ట్, నాలుగు టేబుల్ స్పూన్లు లవంగాల పొడి వేసి అన్ని కలిసేంత వరకు స్పూన్ తో బాగా మిక్స్ చేసుకుంటే పౌడర్ సిద్ధం అవుతుంది.

Advertisement

ఈ టూత్ పౌడ‌ర్‌ను ఒక డబ్బాలో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.టూత్ పేస్ట్ కు బదులుగా ఈ టూత్ పౌడర్‌ను ఉపయోగించి దంతాలను సున్నితంగా రెండు నుంచి మూడు నిమిషాల పాటు తోముకోవాలి.ఆ తర్వాత వాటర్ తో శుభ్రంగా దంతాలను మరియు నోటిని క్లీన్ చేసుకోవాలి‌.

ఈ హోమ్ మేడ్ టూత్ పౌడర్ ను ప్రతిరోజు గనుక వాడితే దంతాలు తెల్లగా ముత్యాల మాదిరి మెరుస్తాయి.అలాగే బలహీనమైన దంతాలు బలంగా మరియు దృఢంగా తయారవుతాయి.

Advertisement

తాజా వార్తలు